Hyd-Vijayawada: హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం రాకపోకలు బంద్.. ప్రత్యామ్నాయ రూట్లు ఇవే! హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి. సూర్యపేట-ఖమ్మం మార్గంలో పాలేరు నది పొంగిపొర్లుతోంది. దీంతో అత్యవసర ప్రయాణాలు ఉన్నవారికోసం కొన్ని ప్రత్యేక రూట్లు సూచించారు పోలీసులు. By srinivas 01 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Hyd-Vijayawada: రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల జన జీవనం స్థంభించిపోయింది. భారీ వరదలు పోటెత్తడంతో ప్రధాన రహాదారులన్నీ జలయమమయ్యాయి. చిల్లకల్లు నందిగామ వద్ద NH 65 పై వర్షం నీరు పొంగిపొర్లుతోంది. సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే మార్గంలో నాయకని గూడెం వద్ద పాలేరు నది పొంగిపొర్లుతోంది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ్ పట్టణం దాటిన తర్వాత రామాపురం ఎక్స్ రోడ్ వద్ద వంతెన కూడా కూలిపోయింది. భద్రత కారణాల దృష్ట్యా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని, అత్యవసర, అనివార్య పరిస్థితులలో ప్రయాణికులు ఈ క్రింది మార్గాలలో వెళ్లాలని పోలీసులు సూచించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ: హైదరాబాద్-చౌటుప్పల్-చిట్యాల్-నార్కెట్‌పల్లి-నల్గొండ-మిర్యాలగూడ-పిడుగురాళ్ల-గుంటూరు-విజయవాడ వెళ్లాలి. హైదరాబాద్ నుంచి ఖమ్మం: హైదరాబాద్-చౌటుప్పల్-చిట్యాల్-నక్రేకల్-అర్వపల్లి-తుంగతుర్తి-మద్దిరాల-మరిపెడ బంగ్లా-ఖమ్మం. మీదుగా వెళ్ళాలని పోలీసులు సూచించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి