Knight Frank Report : భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ జోష్..ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ టాప్ ప్లేస్..!!

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ జోరుమీదుంది. లేటెస్టుగా వచ్చిన ఓ రిపోర్టు ప్రకారం..ఇళ్ల అమ్మకాల్లో, ధర పెరుగుదలతో భాగ్యనగరం దూసుకుపోతున్నట్లు కనిపించింది. దేశంలోని 8 నగరాల గణాంకాలను వెల్లడించిన ఈ రిపోర్టు...అందులో ఇళ్ల ధరల పెరుగుదలకు సంబంధించి హైదరాబాద్ మొదటిస్థానంలో ఉందని పేర్కొంది.

New Update
Knight Frank Report : భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ జోష్..ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ టాప్ ప్లేస్..!!

హైదరాబాద్ లో రియల్ భూమ్ జోరుగా సాగుతోంది. నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం దూసుకుపోతోంది. తాజాగా వచ్చిన ఓ రిపోర్టు ప్రకారం హైదరాబాద్ ఇళ్ల అమ్మకాలు, ధరల పెరుగుదలలో అగ్రస్ధానంలో ఉంది. రోజురోజుకు హైదరాబాద్ లో స్థిరాస్తి విక్రయాలు భారీగా పెరుగుతున్నాయని సర్వేరిపోర్టు చెబుతోంది. తాజాగా ప్రముఖ స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ రిలీజ్ చేసిన ఓ రిపోర్టు ప్రకారం...హైదరాబాద్ నగరం ఇళ్ల అమ్మకాల్లో ముందంజలో ఉన్నట్లు పేర్కొంది.

ఇది కూడా చదవండి: బకాయిలు చెల్లించండి.. లేకపోతే సర్వీస్‌ ఫసక్‌ అవుతుంది.. వొడాఫోన్ ఐడియాకు వార్నింగ్‌!

దేశంలో మొత్తం ఎనిమిది నగరాల గణాంకాలను ఈరిపోర్టులో వెల్లడించింది. ఇందులో ఇళ్ల ధరల పెరుగుదలకు సంబంధించి హైదరాబాద్ మొదటిస్థానంలో ఉందని పేర్కొంది. ఇక్కడ ఇళ్లకు భారీగా డిమాండ్ ఉందని అందుకే ఇళ్ల ధరలు పెరుగుతున్నాయని ఆ రిపోర్టులో వెల్లడించింది. ముంబై మహానగరంలో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది 4శాతం పెరిగాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ క్యార్టర్ లో 13,981 ఇళ్లు, బెంగుళూరులో 13,169యూనిట్లు అమ్ముడుపోయినట్లు తెలిపింది.

ఇది కూడా చదవండి: రూ.63వేల శాలరీతో ఎస్బీఐ జాబ్స్‌.. అప్లికేషన్‌కి గడువు పొడిగింపు..!

గతేడాదితో పోల్చితే హైదరాబాద్ లో వృద్ధిరేటు ఎక్కువగా ఉంది. గతేడాది హైదరాబాద్ లో జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 7900ఇళ్లు అమ్ముడయ్యాయి. ఈసారి 5శాతం పెరిగింది. అంటే దాదాపు 8,325యూనిట్లు సేల్ అమ్ముడయ్యాయి. ఇది రియల్ ఎస్టేట్ దూకుడుమీదున్నదని చెప్పడానికి ఉదాహరణ. ఇళ్ల ధరలు చూస్తే గతేడాది ఇదే సమయంతో పోల్చినట్లయితే 11శాతం వృద్ధి కనిపించిందని ఉందని తాజా రిపోర్టులో వెల్లడించింది. ప్రధాన నగరాల్లో పోల్చితే హైదరాబాద్ లోనే డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది. కోల్ కతాలో 7శాతం, ముంబై, బెంగళూరులో 6శాతం, పుణేలో 5శాతం, ఢిల్లీ, అహ్మదాబాద్ లో 4శాతం, చెన్నైలో 3శాతం ధరలు పెరిగినట్లు రిపోర్టు చెబుతోంది.

ఇది కూడా చదవండి: సెలబ్రిటీలు ఫాలో అయ్యే బ్యూటీ సీక్రెట్స్ ఇవే.. ఒకసారి ట్రై చేసి చూడండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు