Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. పెట్రోల్ కోసం కాల్చేశాడు..!

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. జీడిమెట్లలో పెట్రోల్ కోసం ఓ బైకర్‌పై కాల్పులు జరిపారు దుండగులు. తమ బైక్‌లో పెట్రోల్ అయిపోవడంతో అటుగా వస్తున్న మరో బైక్‌లో పెట్రోల్ చోరీకి యత్నించారు. బైక్ ఓనర్ అడ్డుకోవడంతో మల్లంపేట్‌కు చెందిన నరేష్‌ అతనిపై కాల్పుడు జరిపాడు.

New Update
Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. పెట్రోల్ కోసం కాల్చేశాడు..!

Hyderabad: హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన బైక్ లో పెట్రోల్ అయిపోవడంతో అటుగా వస్తున్న మరో బైక్ లో పెట్రోల్ చోరీ చేసేందుకు యత్నించాడు. కానీ ఆ బైక్ ఓనర్ అడ్డుకోవడంతో.. చోరీ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి తన గ్యాంగ్ కు ఫోన్ చేసి ఘటన స్థలానికి పిలిపించాడు. దీంతో గొడవ కాస్త పెద్దదిగా మారింది. ఇంతలో అతని గ్యాంగ్ లోని ఓ వ్యక్తి  బైక్ ఓనర్ పై కాల్పులు జరిపాడు. అనంతరం సమాచారం అందుకున్న ఘటన స్థలానికి చేరుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని మల్లంపేట్‌కు చెందిన నరేష్‌గా గుర్తించారు. అతను బీహార్ నుంచి అక్రమంగా తుపాకీ తీసుకొచ్చినట్లు.. దానికి లైసెన్స్ కూడా లేనట్లుగా తెలిపారు పోలీసులు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Uttar Pradesh: చిన్నారులను పీక్కుతింటున్న తోడేళ్లు.. 9 మంది మృతి, 30 మందికి గాయాలు! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు