Oyo Rooms: ఓయో రూములు అంటే.. ఓహొయ్ అంటున్న హైదరాబాదీలు.. దేశంలోనే ఎక్కువగా.. 

ఓయో రూముల బుకింగ్స్ లో హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ఓయో తెలిపింది. హైదరాబాద్ తరువాతి స్థానాల్లో బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా ఉన్నాయి. అలాగే బుకింగ్స్ విషయంలో చిన్న పట్టణాల్లో గుంటూరు, వరంగల్ టాప్ 5 లో ఉన్నాయి. 

Oyo Rooms: ఓయో రూములు అంటే.. ఓహొయ్ అంటున్న హైదరాబాదీలు.. దేశంలోనే ఎక్కువగా.. 
New Update

Oyo Rooms: ఏదైనా దూరప్రాంతాల సందర్శన లేదా ఎక్కడికైనా పని ఉండి వెళ్లాల్సి వస్తే అక్కడ హోటల్ రూమ్ తీసుకోవడం సాధారణం. ఇటీవలి కాలంలో ఓయో ద్వారా ఆన్ లైన్ లో హోటల్ రూమ్స్ బుక్ చేసుకోవడం ఎక్కువగా జరుగుతోంది. ఓయో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో హోటల్ రూమ్స్ తన యాప్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. అంతేకాదు.. డిస్కౌంట్స్ కూడా అందుబాటులోకి తెస్తుంటుంది. అలాగే ఓయో కూడా సొంతంగా చాలా ప్రాంతాల్లో రూమ్స్ ఆపరేట్ చేస్తూ ఓయో రూమ్స్ పేరిట ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతోంది. దీంతో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకునేవారు ఎక్కువగా ఓయో రూమ్స్ పై ఆధారపడటం జరుగుతూ వస్తోంది. ప్రతి సంవత్సరం ఓయో(Oyo Rooms).. దేశంలోని పర్యాటక స్థితి గతులతో పాటు.. హోటల్ పరిశ్రమకు సంబంధించిన డేటాను విడుదల చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అటువంటి డేటాను విడుదల చేసింది ఓయో.  ట్రావెలోపీడియా-2023 (Travelopedia 2023) పేరుతొ విడుదల చేసిన ఈ రిపోర్ట్ లో ఆసక్తికర అంశాలు చాలా ఉన్నాయి. 

ఆ రిపోర్ట్ ప్రకారం.. హైదరాబాద్ ఈ సంవత్సరం ఎక్కువమంది పర్యాటకులు హోటల్ గదులు(Oyo Rooms) బుక్ చేసుకున్న నగరంగా నిలించింది. అదీ కూడా సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2 వరకూ హైదరాబాద్ లో (Hyderabad) బుకింగ్స్ ఎక్కువ ఉన్నాయని రిపోర్ట్ చెప్పింది. 

Also Read: ఒక్కరోజులో కోట్లు కొల్లగొట్టింది.. ఎలా అంటే..

ఇంకా ఓయో రిపోర్ట్ లో పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.  

  • ఈ ఏడాది ఉత్తరప్రదేశ్ ఎక్కువ మంది విజిట్ చేసిన రాష్ట్రంగా నిలిచింది. 
  • హైదరాబాద్ తరువాత బెంగళూరు, దిల్లీ , కోల్‌కతా ఎక్కువ రూమ్స్  బుక్ అయినా నగరాల్లో వరుసగా ఉన్నాయి. 
  • అదేవిధంగా చిన్న పట్టణాల విషయానికి వస్తే.. యూపీలోని గోరఖ్‌పూర్‌, పశ్చిమ బెంగాల్ లోని దిఘా అలాగే తెలంగాణకు చెందిన వరంగల్, ఏపీ లోని గుంటూరు వరుసగా ఎక్కువ రూమ్స్ బుక్ చేసుకున్న పట్టణాలలో నిలిచాయి. 
  • ప్రజలు విశ్రాంతి కోసం జయపుర ఎక్కువగా ఎంచుకున్నారు. తరువాత గోవా, మైసూర్, పుదుచ్చేరిలో ఎంజాయ్ చేశారు. 
  • ఆధ్యాత్మికంగా ఈ సంవత్సరం ఎక్కువ మంది సందర్సించిన ప్రాంతాల్లో పూరీ అగ్రస్థానంలో ఉంది. అమృత్‌సర్‌, వారణాసి, హరిద్వార్‌ ఆ తరువాతి స్థానాల్లో ఉండగా.. దేవ్‌ఘర్‌, పళని, గోవర్ధన్‌ వంటి ఆధ్యాత్మిక కేంద్రాలకూ ప్రజలు బాగానే వెళ్లారు. 
  • హోటల్ గదులను ఎక్కువ బుక్ చేసుకున్న రాష్ట్రాల్లో అగ్రస్థానం ఉత్తర ప్రదేశ్ ది . ఆ తరువాత వరుసగా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. 
  • ఒకేరోజు ఎక్కువ బుకింగ్స్ జరిగిన తేదీ సెప్టెంబర్ 30. అలాగే ఎక్కువ బుకింగ్స్ జరిగిన నెల మే అని రిపోర్ట్ చెప్పింది. 

ఈ రిపోర్ట్ విడుదల సందర్భంగా  ఓయో గ్లోబల్‌ చీఫ్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ శ్రీరంగ్‌ గాడ్బోలే (Shreerang Godbole) మాట్లాడుతూ, కరోనా తరువాత దేశంలో ఎక్కువమంది వివిధ ప్రాంతాలను సందర్సించే దొరతని పెరిగింది అని చెప్పారు. ఇది తరువాత పెరుగుతూ వస్తోందని అన్నారు. అంతర్జాతీయంగా విశ్రాంతి కోసం వెళ్లే ధోరణి ట్రావెల్ రంగానికి బలాన్ని ఇస్తే.. మన దేశం విషయంలో బిజినెస్ టూర్స్ కూడా హోటల్ గదుల బుకింగ్స్ పెరగడానికి దోహదం చేశాయని ఆయన వివరించారు. 

Watch this interesting Video:

#tourism #travelopedia-2023 #oyo-rooms #hotel-rooms
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe