Rains: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అతి భారీ వర్షం.. రెండు గంటలు దంచిపడేసింది!

హైదరాబాద్‌ ఒక్కసారిగా డేంజర్‌ జోన్‌లోకి వెళ్లిపోయింది. వరుణుడు నాన్‌స్టాప్‌గా దంచికొడుతున్నాడు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, షేక్ పేట ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. మియాపూర్‌, కుకట్‌పల్లిలో భారీగా వర్షపాతం నమోదైంది.

New Update
Rains: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అతి భారీ వర్షం.. రెండు గంటలు దంచిపడేసింది!

Hyderabad rains: హైదరాబాద్‌లో వరుణుడు రెచ్చిపోతున్నాడు. అసలు ఎక్కడా తగ్గట్లేదు.. కాస్త తగ్గిందని అలా బయటకు వచ్చామా అంతే సంగతి.. సెకెన్ల వ్యవధిలో మళ్లి దంచికొడుతున్నాడు. ఇదేం వర్షంరా బాబు అని ప్రజలు తలలు కొట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కూడా కొంతమంది తమ పిల్లలను స్కూల్స్‌కి పంపించి అక్కడ హాలీడే అని తెలుసుకోని రిటర్న్ అవుతున్నారు. ఇంత వర్షంలో స్కూల్‌కి పంపడం అవసరమా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, షేక్ పేట ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఇక హైదరాబాద్‌ వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అతి భారీ వర్షం కురుస్తోంది.

హైదరాబాద్‌లో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం వివరాలు:

🌨 మియాపూర్‌లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం..

🌨 కూకట్‌పల్లిలో 14.3 సెంటీమీటర్లు..

🌨 శివరాంపల్లిలో 13 సెంటీమీటర్లు..

🌨 గాజుల రామారామ్‌లో 12.5 సెంటీమీటర్లు..

🌨 బోరబండలో 12.5 సెంటీమీటర్లు..

🌨 జీడిమెట్లలో 12.1 సెంటీమీటర్..

🌨 షాపూర్, మూసాపేట్,జూబ్లీ హిల్స్ లో 12 సెంటీమీటర్లు..

🌨 కుత్బుల్లాపూర్ లో 11.5 సెంటీమీటర్లు..

🌨 మాదాపూర్‌లో 11.4 సెంటీమీటర్లు..

🌨 సికింద్రాబాద్, రాజేంద్రనగర్ లో 11.2 సెంటీమీటర్లు..

🌨 బేగంపేట్, కెపిహెచ్బి, అల్వాల్, శేలింగంపల్లిలో 10 సెంటీమీటర్లు..

🌨 ముషీరాబాద్ లో 9.9 సెంటీమీటర్లు..

🌨 గోషామహల్ లో 9.5 సెంటీమీటర్లు..

🌨 మలక్పేట్ లో 9.4 సెంటీమీటర్లు..

🌨 ఫలక్నుమాలో 9.2 సెంటీమీటర్లు..

🌨 కార్వాన్ లో 8.8 సెంటీమీటర్లు..

🌨 సరూర్‌నగర్‌లో 7.9 సెంటీమీటర్లు..

🌨 ఎల్బీనగర్, అంబర్పేట్ లో 6.6 సెంటీమీటర్లు..

🌨 మల్కాజ్గిరి, మౌలాలిలో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం ప్రమోదు.

లోతట్టు ప్రాంతాలు జలమయం:

నగరంలోని అనేక బస్తీల్లో వర్షం కారణంగా ఇబ్బందులు పెరిగిపోయాయి. పలు బస్తీల్లో ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు చేరాయి. లింగంపల్లి అండర్‌పాస్‌ వద్ద భారీగా వర్షం నీళ్లు నిలిచాయి. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పలు ప్రాంతాల్లో నాలా పొంగి వరద నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాల కురుస్తున్న పరిస్థితుల్లో జనం అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఉస్మాన్ సాగర్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రెండు గేట్లు ద్వారా ముసిలోకి 442 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. అటు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నార్సింగి బాలాజీ నగర్ కాలనీలో భారీ వర్షం పడడంతో ఇళ్లల్లోకి వరద నీరు చేరుకుంటోంది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే వరద నీరు తొలగించాలని నార్సింగి మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. అయినా ఇప్పటివరకు అధికారులు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: విద్యార్థులకు అలెర్ట్.. స్కూల్‌కి సెలవు ప్రకటన.. రెయిన్‌ ఎఫెక్ట్!

Advertisment
తాజా కథనాలు