Hyderabad: హిట్ అండ్ రన్ కేసులో సాఫ్ట్ వేర్ బ్యాచ్..!

హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్‌ కేసును ఛేదించారు పోలీసులు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో ఒక యువతి, నలుగురు యువకులు ఉన్నారు. మద్యం మత్తులోనే కారు అతి వేగంతో నడిపి ప్రమాదానికి కారణమైనట్టు పోలీసులు గుర్తించారు.

New Update
Hyderabad: హిట్ అండ్ రన్ కేసులో సాఫ్ట్ వేర్ బ్యాచ్..!

Hyderabad Hit and Run Case: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్‌ కేసును ఛేదించారు పోలీసులు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో ఒక యువతి, నలుగురు యువకులు, ఉన్నారు. మద్యం మత్తులోనే కారు అతి వేగంతో నడిపి ప్రమాదానికి కారణమైనట్టు గుర్తించారు పోలీసులు. జూబ్లీహిల్స్‌లో తెల్లవారుజామున ఉదయం 5గంటలకు జరిగిన యాక్సిడెంట్‌లో బౌన్సర్ తారక్‌రామ్‌ మృతి చెందాడు. దీనికి కారణమైన ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: ఎక్కడికి వస్తారో రండి.. చేసిన అభివృద్ధిని చూపిస్తాం.. షర్మిలకు అమర్నాథ్ కౌంటర్

A1గా కొవ్వూరి రిత్విక్‌రెడ్డి, A2 వైష్ణవి, A3 లోకేశ్వర్‌ రావు, A4 బుల్లా అభిలాష్, A5 అనికేత్‌ ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు పట్టుకుంటారనే భయంతోనే..A1 రిత్విక్‌రెడ్డి పరారయ్యాడని ఏసీపీ హరిప్రసాద్ తెలిపారు. కారును BHELలో దాచి పెట్టారన్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

Also Read: దేవర మూవీ రిలీజ్ వాయిదాలో నిజమెంత?

రిత్విక్‌రెడ్డి అమెజాన్‌లో పనిచేస్తున్నాడని.. తన ఆఫీస్‌ చూపిస్తానని స్నేహితులను తీసుకెళ్లాడని వివరించారు. ఆ తరువాత ఫ్రెండ్స్ అందరూ కలిసి బార్ కు వెళ్లారని తెల్లవారుజామున నాలుగు గంటల వరకు బార్ లోనే ఫుల్ గా తాగి ఉన్నారని అన్నారు. రిత్విక్‌ మద్యం మత్తులో కారు డ్రైవ్‌ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఏసీపీ వెల్లడించారు. అతడితో పాటు కారులో ఉన్న వారిని కూడా నిందితులుగా చేర్చినట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు