Paloma Villa: నీట మునిగిన కోట్లు రూపాయల విల్లాలు.. లబోదిబోమంటున్న బాధితులు! రంగారెడ్డి జిల్లాలోని మోకిల్లాలో 212 పలోమా విల్లాలు నీటిలో మునిగాయి. లగ్జరీ కార్లు, బైకులు వరద నీటిలో తేలియాడుతున్నాయి. ఒక్కో విల్లా ఖరీదు రూ.3 కోట్లకు పైగానే ఉండగా.. కోట్ల రూపాయలు పెట్టి కొంటే తమను వరదల్లో ముంచేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. By srinivas 02 Sep 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Paloma Villa: రంగారెడ్డి జిల్లాలోని మోకిల్లాలో మునిగిన పలోమా విల్లాలు నీటిలో మునిగాయి. విల్లాలకు ఆనుకుని కాంపౌండ్ వాల్ నిర్మించడంతో వరదనీరంతా అక్కడే ఆగి 212 విల్లాల్లోకి భారీగా నీరు చేరింది. ఒక్కో విల్లా ఖరీదు రూ.3 కోట్లకు పైగానే ఉండగా.. లగ్జరీ కార్లు, బైకులు వరద నీటిలో తేలియాడుతున్నాయి. అయితే దీనిపై బాధితులు లబోదిబో అంటున్నారు. కోట్ల రూపాయలు పెట్టి కొంటే తమను వరదల్లో ముంచేశారని వాపోతున్నారు. వెంటనే ప్రహరీ గోడను పగలగొట్టాలంటూ విల్లా యాజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యాదయ్య విల్లాలను పరిశీలించారు. Also Read : సమంతకు మద్దతుగా అనుష్క శెట్టి.. టాలీవుడ్‌లోకి హేమ కమిటీ ఎంట్రీ!? #hyderabad #moqilla #paloma-villas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి