Viral Video: డీజే టిల్లూ పాటకు పోలీసుల దుమ్ములేపే డ్యాన్స్.. ఈసారి నిమజ్జనంలో హైలెట్ ఇదే! కేవలం బందోబస్తుకు మాత్రమే పరిమితం కాకుండా తమ డ్యాన్స్ తో దుమ్ము లేపారు హైదరాబాద్ ఖాకీలు. ఈ సారి శోభాయాత్రలో అనేక చోట్ల పోలీసులు చేసే డ్యాన్స్ హైలెట్ గా నిలిచింది. ఎప్పుడు సీరియస్ గా కనిపించే పోలీసులు తమతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేయడంతో భక్తులు కేరింతలు కొట్టారు. By Nikhil 28 Sep 2023 in తెలంగాణ ట్రెండింగ్ New Update షేర్ చేయండి గణేశ్ ఉత్సవాలు అంటేనే హైదరాబాద్ స్పెషల్. నిమజ్జనం రోజు సాగే శోభాయాత్ర ఇంకా స్పెషల్. డ్యాన్స్ లు కేరింతలతో గణేశుడికి ఘనంగా వీడ్కోలు పలుకుతూ ఉంటారు భక్తులు. అయితే.. ఈ సారి శోభాయాత్రలో స్పెషల్ గా నిలిచారు పోలీసులు. కేవలం బందోబస్తుకు మాత్రమే పరిమితం కాకుండా తమ డ్యాన్స్ తో దుమ్ము లేపారు హైదరాబాద్ ఖాకీలు. ఈ సారి శోభాయాత్రలో అనేక చోట్ల పోలీసులు చేసిన డ్యాన్స్ హైలెట్ గా నిలిచింది. ఎప్పుడు సీరియస్ గా కనిపించే పోలీసులు తమతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేయడంతో భక్తులు మరింత ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోలీసుల డ్యాన్స్ బాగుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఉత్సవం ఏదైనా.. ప్రశాంతంగా నిర్వహించడం తెలంగాణ పోలీసులకే సాధ్యం అంటూ కితాబిస్తున్నారు మరి కొందరు. ఇది కూడా చదవండి: Khairathabad Ganesh Nimajjanam Live: గంగమ్మ ఒడికి మహాగణపతి.. నిమజ్జనం పూర్తి.. లైవ్ అప్డేట్స్! “GANGA - JAMUNI Tehzeeb”: That’s what #Telangana is Proud of✊ Today happens to be the day when #GaneshNimarjan and #MiladUnNabi coincide And here👇are the People and the Police👮♂️ celebrating the festivities with music and dance on the streets of #Hyderabad When a Leader like… pic.twitter.com/H9PEZgbW78 — Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR) September 28, 2023 ఇదిలా ఉంటే హైదరాబాద్ లో గణేశ్ శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగుతోంది. ఇప్పటికే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి అయ్యింది. బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర నగరానికి చేరుకుంది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఎప్పటికప్పుడు నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ పోలీసులకు సూచనలు చేస్తున్నారు. మొత్తం 40 వేలకు పైగా పోలీసులు గణేశ్ నిమజ్జనం సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు 20 వేల సీసీ కెమెరాల ద్వారా నిమజ్జనాన్ని పరిశీలిస్తున్నారు, #hyderabad #vinayaka-chavithi #ganesh-nimajjanam-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి