/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/ts-1.jpg)
Hyderabad Late Night Pubs : డ్రగ్స్ కల్చర్ (Drug Culture) పై రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కారు కొరడా ఝలిపించారు. హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి జిల్లాలోని పబ్‌లు, బార్‌లలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. 25 పబ్‌లలో ఎక్సైజ్, టీఎస్ నాబ్ సోదాలు నిర్వహించారు. పబ్బుల్లో 107 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించగా అందులో డ్రగ్స్ తీసుకున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు.
Also Read: హైడ్రా అటాక్.. బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి కట్టడాల కూల్చివేత..!
పక్కా సమాచారంతో జీ 40 పబ్, విస్కీ సాంబా, జోరా, క్లబ్ రోగ్ పబ్బుల్లో అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. రాత్రి 11గంటల నుండి అర్ధరాత్రి ఒంటి గంట వరకు తనిఖీలు చేశారు.