/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-15T185540.163.jpg)
Hyderabad: హైదరాబాద్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బోడుప్పల్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లోని ఓ కీచక డాన్స్ టీచర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఒకటవ తరగతి చదువుతున్న చిన్నారి పట్ల డ్యాన్స్ మాస్టర్ రవి అసభ్యంగా ప్రవర్తించిన దారుణ సంఘటన బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పై డాన్స్ మాస్టర్ రవిని పోలీసులు విచారించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆందోళనకు గురైన చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు అతన్ని చితకబాదారు. ప్రస్తుతం డ్యాన్స్ మాస్టర్ రవి, స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.