Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. కత్తితో ప్రియురాలి గొంతుకోసిన ప్రియుడు..! హైదరాబాద్ ఛత్రినాకలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలు శ్రావ్య పై అనుమానంతో ఆమె పై కత్తితో దాడికి పాల్పడ్డాడు ప్రియుడు మణికంఠ. కొద్దిరోజులుగా తనకు దూరంగా ఉంటున్న శ్రావ్య మరొకరితో క్లోజ్‌గా ఉంటుందన్న అనుమానంతో దాడి చేశాడు. ప్రస్తుతం శ్రావ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. By Archana 18 Jun 2024 in క్రైం టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Hyderabad: హైదరాబాద్ లోని ఛత్రినాకలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలు శ్రావ్య పై అనుమానంతో విచక్షణారహితంగా కత్తితో ఆమె పై దాడికి పాల్పడ్డాడు ప్రియుడు మణికంఠ. అయితే శ్రావ్య అనే అమ్మాయికి 2019లో వివాహం జరిగింది. ఆ తర్వాత పెళ్ళైన కొంతకాలానికి భర్తతో విబేధాలు రావడంతో అతనికి విడాకులు ఇచ్చింది శ్రావ్య. భర్తకు విడాకులు ఇచ్చిన శ్రావ్య తన చిన్ననాటి స్నేహితుడు మణికంఠతో శ్రావ్య ప్రేమ వ్యవహారం కొనసాగించింది. ప్రియురాలి పై కత్తితో దాడి ఇక కొద్దిరోజులుగా తనకు శ్రావ్య దూరంగా ఉండడంతో.. ఆమె మరొకరితో క్లోజ్ గా ఉంటుందన్న అనుమానం వచ్చిన ప్రియుడు మణికంఠ ఆమె ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో విచక్షణ కోల్పోయిన మణికంఠ ప్రియురాలు శ్రావ్య పై దాడికి పాల్పడ్డాడు. కత్తితో శ్రావ్య గొంతుకోసి ముఖం పై దాడి చేశాడు. చివరకు శ్రావ్య అరుపులు విన్న స్థానికులు కిటికీ అద్దాలు పగులగొట్టి చూడగా దారుణం వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన శ్రావ్యను వెంటనే ఆస్ప్రత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రావ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. Also Read: Laxmi Devi Idol: ఇంట్లో లక్ష్మీ దేవి విగ్రహం ఉందా...? ఈ 5 తప్పులు చేయకండి.! - Rtvlive.com #hyderabad-crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి