/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Hyderabad-CP-jpg.webp)
హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బషీర్‌బాగ్ పాత సీపీ కార్యాలయంలో ఉండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే సిబ్బంది, అధికారులు ఆయనను హుటాహుటిన హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న సందీప్ శాండిల్యాను ఎన్నికల కమిషన్ సూచన మేరకు హైదరాబాద్ సీపీగా అక్టోబర్ లో బదిలీ చేశారు. ఓ దశలో ఆయనకు గుండె పోటు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై సందీప్ శాండిల్య స్పందించారు. ఆస్పత్రి నుంచి వీడియో విడుదల చేశారు. కళ్లు తిరిగినట్లు అనిపించడంతో తాను ఆస్పత్రికి వచ్చినట్లు సందీప్ శాండిల్య తెలిపారు. పరీక్షల్లో లోబీపీ, స్పాండిలైటిస్ అని తేలిందన్నారు. 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందన్నారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు.