Hyderabad CP: న్యూ ఇయర్ వేడుకలపై (New Year Celebrations) నూతన హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నిఘా పెట్టారు. ఈవెంట్స్, పబ్స్ పై ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ రోజు రాత్రి ఒంటి గంట వరకే ఈవెంట్స్, పబ్స్ కు అనుమతి అంటూ ఆదేశాలు ఇచ్చారు. రాత్రి 12.30 గంటల నుంచే కస్టమర్లను బయటకు పంపాలని తెలిపారు. ఈ వేడుకల్లో డ్రగ్స్, మత్తు పదార్థాలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఇయర్ ఎండింగ్ క్రైమ్ రివ్యూ (Year Ending Crime Review) పై ఆయన మాట్లాడారు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని అన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయి 10 ఏళ్ళు పూర్తి అయిందని పేర్కొన్నారు.
ALSO READ: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు!
హైదరాబాద్ సీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. FIR లు 24, 821 నమోదు అయ్యాయని.. గత ఏడాది తో పోలిస్తే 2 శాతం క్రైమ్ రేట్ పెరిగిందని అన్నారు. 9% దోపిడీలు, మహిళలపై 12 % నేరాలు పెరిగాయని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే చిన్నారులు పై 12 % నేరాలు తగ్గినట్లు తెలిపారు. వివిధ కేసులో నష్టం జరిగిన విలువ 38 కోట్లు ,పొగిట్టుకున్న సొత్తులో 75 % రికవరీ చేసినట్టు ప్రకటించారు. హత్యలు 79 , రేప్ కేసులు 403 , కిడ్నాప్ లు 242, చీటింగ్ కేసులు 4909, రోడ్డు ప్రమాదాలు 2637, హత్యాయత్నాలు 262, చోరీలు 91 నమోదు అయ్యాయని వెల్లడించారు. ఈ ఏడాది 63 % నేరస్తులకు శిక్షలు పడ్డాయని.. 13 కేసులో 13 మందికి జీవిత ఖైదీ శిక్షలు అమలు అయినట్లు తెలిపారు.
Also Read: వాహనదారులకు గుడ్ న్యూస్… చలాన్లపై మరోసారి రాయితీ!
గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 19 % పెరిగిన రేప్ కేసులు
మత్తు పదార్థాలు వాడిన 740 మంది అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. డ్రగ్స్ కేసులో 13 మంది విదేశీయులు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో డ్రగ్స్ (Drugs) అనే మాట వినపడవద్దు అని తేల్చి చెప్పారు. హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నా వెతికి వెతికి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ సప్లై, డిమాండ్ పై ఫోకస్ ఉందని అన్నారు. గల్లీలో గంజాయి పై కూడా నిఘా పెరిగిందని తెలిపారు. డ్రగ్స్ ను పట్టుకునేందుకు రెండు స్నిఫర్ డాగ్స్ ప్రత్యేకంగా శిక్షణ ఐచినట్లు ఆయన పేర్కొన్నారు. గత ఏడాది తో పోలిస్తే ఈఏడాది 11 శాతం సైబర్ నేరాలు పెరిగాయని అన్నారు. సైబర్ క్రైమ్స్ నేరాలకు పాల్పడిన 650 మంది అరెస్ట్ చేసినట్లు తెలిపారు.