/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/JAGAN-2-jpg.webp)
జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్ట్ గ్రీన్ సిగ్నల్ సిగ్నల్ ఇచ్చింది. జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల మే 17 నుంచి జూన్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతించాలని ఇటీవల సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 9న ఈ పిటిషన్ పై సీబీఐ కోర్టు విచారణ నిర్వహించింది. అయితే.. జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ వాదనలు వినిపించింది. అక్రమాస్తుల కేసులో విచారణ కీలక దశకు చేరుకున్న ఈ సమయంలో జగన్ విదేశీ పర్యటనలకు జగన్‌కు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోర్టును కోరింది.
జగన్ ఇప్పటివరకు ఎప్పుడు విదేశాలకు వెళ్లినా.. నిబంధనలు ఉల్లంఘించలేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో జగన్ వినతికి న్యాయస్థానం అంగీకరించింది. విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. దీంతో జగన్ ఈ నెల 17న కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
ఇదిలా ఉంటే నిన్న హోరాహోరీగా జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇస్తున్నానన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.