యూనిఫాం సివిల్ కోడ్‌ను వ్యతిరేకించిన బీఆర్‌ఎస్ వచ్చే పార్లమెంట్‌సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. దేశ ప్రజలను మళ్లీ విభజించేందుకు ఈ బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెస్తున్నదని దుయ్యబట్టారు. By Vijaya Nimma 11 Jul 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు భేటీ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో కేసీఆర్‌తో ఎంఐఎం నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ, ఆల్ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు భేటీ అయ్యారు. యూసీసీ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో వ్యతిరేకించాలని వారు సీఎంను కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధిని విస్మరించి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నదని, ఇప్పుడు యూసీసీ పేరుతోనూ కుయుక్తులు పన్నుతున్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఎన్ని సమస్యలు ఉన్నా పట్టించుకోవడం లేదు బీజేపీ సర్కార్ తీసుకునే నిర్ణయాలను తాము తిరస్కరిస్తామన్నారు. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన భారతదేశ ప్రజల ఐక్యతను చీల్చేందుకు యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. దేశంలో ప్రత్యేక సంస్కృతి గల ఆదివాసీలు, గిరిజనులు, పలు మతాలు, జాతుల వారితో పాటు పలు ప్రాంతాల్లోని హిందువులు ఈ బిల్లుతో అయోమయానికి గురవుతారన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న యూసీసీ చట్టం దురుద్దేశంతో కూడుకున్నదని కేసీఆర్ ఆరోపించారు. దేశంలో ఎన్నో సమస్యలున్నా వాటిని మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ సీఎం విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టి.. విభజన రాజకీయాలు అయింతే కాకుండా దేశంలో పనులేమీ లేనట్టు ప్రజలను రెచ్చగొట్టి అనవసరమైన గొడవలు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే ఈ చట్టం పేరుతో మరోసారి విభజన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును అడ్డుకుంటం. భావ సారూప్యత కలిగిన పార్టీలను కలుపుకుని పోరాడుతామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించి పార్లమెంట్ ఉభయ సభల్లో చేపట్టే కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకోవాలని బీఆర్ఎస్ రాజ్యసభ, లోక్‌సభ పక్ష నేతలు డాక్టర్ కె. కేశవరావు, నామా నాగేశ్వర్‌రావును సీఎం ఆదేశించారు. కాగా, తమ అభ్యర్థనను అర్థం చేసుకుని నిర్ణయం తీసుకున్నందుకు కేసీఆర్‌కు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌ను కలిసి వారిలో ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం ఎల్పీ నేత అక్బరుద్దీన్ ఒవైసీతోపాటు ఆల్ఇండియా ముస్లిం పర్సనల్‌లా బోర్డు అధ్యక్షుడు ఖాలీద్సయిఫుల్లా రెహ్మాని తదితరులు ఉన్నారు. భేటీలో మంత్రులు మహమూద్‌అలీ, కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సయిఫుల్లా రెహ్మానిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఘనంగా సత్కరించారు. 74 పేజీలతో నోట్ సీఎం కేసీఆర్‌కు 74 పేజీలతో కూడిన ఒక నోట్‌ను ఆల్ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు అందజేశారని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. యూసీసీ చట్టం వల్ల కలిగే నష్టాలు అందులో ఉన్నాయని చెప్పారు. త్వరలోనే ఏపీ సీఎం జగన్‌ను కూడా కలిసి యూ సీసీని వ్యతిరేకించాలని కోరుతామని, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల ప్రతినిధులను కలుస్తున్నారని వెల్లడించారు. ఈ బిల్లు పేరుతో దేశ ప్రజల మధ్య కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కార్ ఎలాంటి విభజన తీసుకువస్తుందో కేసీఆర్‌కు వివరించామని అన్నారు. యూసీసీతో ఒక్క ముస్లింలకు మాత్రమే నష్టం జరుగదు.. క్రిస్టియన్లు, గిరిజనులు, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. దేశంలోని గిరిజనులకు భిన్న జీవనశైలి, ఆచార వ్యవహారాలు ఉంటయ్... వాటిని ఇది దెబ్బతీ వస్తుందని అన్నారు. హిందువులకూ ఈ చట్టంతో ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీస్‌కు రూ.3 వంద కోట్ల ట్యాక్స్రిబేట్ దక్కినట్టుగా ఇన్‌కంట్యాక్స్ లెక్కలు చెప్తున్నాయని, ఇప్పుడు యూసీసీ చట్టంతో రాయితీలు కోల్పోతారని అన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి