Hyderabad Biryani: పొద్దున్నే..నాలుగిడ్లీ.. పొద్దెక్కితే బిర్యానీ.. హైదరాబాదీల రూటే సపరేటు! 

హైదరాబాద్ బిర్యానీ అంటే చాలు.. నోరూరుతుంది. ఈ సంవత్సరంలో హైదరాబాదీలు బీభత్సంగా బిర్యానీలు ఆర్డర్ చేశారని స్విగ్గీ చెబుతోంది. దేశవ్యాప్తంగా ప్రతి ఆరు బిర్యానీల ఆర్డర్ లో ఒకటి హైదరాబాద్ నుంచి వచ్చిందట. ఒక హైదరాబాదీ ఈ సంవత్సరంలో మొత్తం 1,633 బిర్యానీలు ఆర్డర్‌ చేశాడు. 

Hyderabad Biryani: పొద్దున్నే..నాలుగిడ్లీ.. పొద్దెక్కితే బిర్యానీ.. హైదరాబాదీల రూటే సపరేటు! 
New Update

Hyderabad Biryani: చేతిలో మొబైల్.. వాలెట్లో డబ్బులు ఈ రెండూ ఉంటే చాలు.. పొద్దున్నే నాలుగు ఇడ్లీలు ఆర్డర్ పెట్టేసి.. మధ్యాహ్నం ఆకలేస్తే ఒక బిర్యానీ తెప్పించేసుకుని కాలక్షేపం చేసేస్తున్నారు మన హైదరాబాద్ మిత్రులు. ఆకలేస్తే అన్నం అనే మాట మరిచిపోయినట్టుగా ఉంది పరిస్థితి. మన హైదరాబాద్ బిర్యానీ రుచి అద్భుతం అని చెప్పడానికి ఎటువంటి డౌట్ లేదు కానీ, అలాగే మన జనాలు ఎగబడి బిర్యానీతో చేసుకుంటున్న పండగ మాత్రం అమోఘం అని చెప్పాల్సిందే. సాధారణంగా మన ఊరిలో ఫేమస్ ఫుడ్ అని చెప్పేదానిపై మనకు పెద్ద ఇంట్రస్ట్ ఉండదు. ఎందుకంటే, పొరుగింటి పుల్లకూర రుచిలా వేరే ప్రాంతాల రుచుల కోసం లొట్టలేసుకుని చెప్పుకుంటాం. కానీ.. బిర్యానీ విషయంలో మాత్రం పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు లాంటి సామెతలు అసలు వర్తించవు. ఎందుకంటే..హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరూ బిర్యానీకి వీరాభిమానులే. ఇదేదో సరదాకు లేకపోతే గాలి కబుర్లు అనుకునేరు. మన హైదరాబాద్ లో జనం ఈ ఏడాది తిని పారేసిన బిర్యానీ ప్యాకింగ్ ల సాక్షిగా వచ్చిన లెక్కలు. ఈ లెక్కలు చూసుకుని.. బిర్యానీ ఆర్డర్  తీసుకుని డోర్ డెలివరీ చేసిన కంపెనీలే హా..శ్చర్య పోతున్నాయి. ఒక్కసారి ఈ లెక్కలు చూశారనుకోండి.. మీరు కూడా మన జనాలు బిర్యానీకి(Hyderabad Biryani).. ఇడ్లీకి పడిచచ్చిపోతున్నారని ఒప్పేసుకుంటారు.. మరి స్విగ్గీ చెప్పిన లెక్కలు ఇవిగో.. మీకోసం.. 

  • ఈ ఏడాది దేశవ్యాప్తంగా సెకనుకు రెండున్న బిర్యానీలు(Hyderabad Biryani) ఆన్ లైన్ లో ఆర్డర్ చేశారట. ఇక ప్రతి ఐదున్నర బిర్యానీల్లో ఒకటి వెజ్ బిర్యానీ ఉంది. దేశవ్యాప్తంగా ప్రతి ఆరు బిర్యానీల ఆర్డర్ లో ఒకటి హైదరాబాద్ నుంచి వస్తోందని స్విగ్గీ చెబుతోంది. 
  • స్విగ్గీ లెక్కల ప్రకారం ఈ ఏడాది కొత్తగా 20.49 లక్షల మంది యూజర్లు బిర్యానీ ఆర్డర్ చేశారట. దేశవ్యాప్తంగా ఈ సంస్థ ప్రతి నిమిషం 250 బిర్యానీలు డెలివరీ చేస్తూ వచ్చింది. 
  • స్విగ్గీ డెలివరీ పార్ట్‌నర్స్‌ సంవత్సరం అంతా ఏకంగా 16.64 కోట్ల కిలోమీటర్లు ఆర్దర్ల డెలివరీకోసం ప్రయాణం చేశారు. వీరిలో చెన్నైకి చెందిన వెంకటేశన్‌ 10,360, కొచ్చికి చెందిన సంథిని 6,253 ఆర్డర్లను డెలివరీ చేసి రికార్డు సృష్టించారు. 
  • ఇక వరల్డ్ కప్ 2023లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా అయితే.. చంఢీగఢ్‌లోని ఓ బిర్యానీ ప్రియుల కుటుంబం ఏకంగా 70 బిర్యానీలు ఆర్డర్‌ చేసింది. అలాగే దేశవ్యాప్తంగా ఆ రోజు ప్రతి నిమిషానికి 250 బిర్యానీలను డెలివరీ చేసింది స్విగ్గీ. 
  • ఇంకో విషయం ఏమిటంటే.. బిర్యానీ అంటే పడిచచ్చే వాళ్ళుంటారు కానీ.. ఈయన మాత్రం బిర్యానీకోసమే చచ్చిపోతాడేమో అనిపిస్తోంది. ఒక హైదరాబాదీ ఈ సంవత్సరంలో మొత్తం 1,633 బిర్యానీలు ఆర్డర్‌ చేశాడు. అంటే రోజుకు నాలుగు బిర్యానీల కంటే ఎక్కువే లాగించేశాడు! 
  • సరే బిర్యానీ కథ ఇలా ఉంటే.. ఇక ఇడ్లీ ప్రియుల స్టోరీ వింటే అదిరిపోతారు.. 2023లో ఓ ఇడ్లీ ప్రియుడు ఇడ్లీల కోసం అక్షరాల రూ. 6 లక్షలు ఖర్చు చేసేశాడు. 

Also Read: మస్క్ మామ మళ్ళీ ఏమో చేశాడు బ్రో.. రోబోను మనిషిని చేసేస్తాడా ఏమి?

బిర్యానీ కాకుండా.. 

  • చెన్నైకి చెందిన ఓ వ్యక్తి కాఫీ, జ్యూస్, బిస్కెట్లు, చిప్స్‌ కోసం ఒక్క ఆర్డర్‌లో అత్యధికంగా రూ. 31,748 ఖర్చు చేశాడు. 
  • చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‌ నుంచి ఒక్కో కస్టమర్‌ నుంచి గరిష్టంగా 10 వేల కంటే ఎక్కువే ఆర్డర్లు వచ్చాయి. 
  • 2023లో బెంగళూరు నుంచి  85 లక్షల చాక్లెట్‌ కేక్స్‌ ఆర్డర్లు వచ్చాయి.
  • హైదరాబాద్, ముంబై కంటే బెంగళూరు నుంచి మామిడి పండ్ల కోసం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. 
  • ప్రేమికుల దినోత్సవం నాడు దేశవ్యాప్తంగా నిమిషానికి 271 కేక్స్‌ ఆర్డర్‌ చేశారు. 
  • నాగ్‌పూర్‌కు చెందిన ఓ కస్టమర్‌ ఒక్క రోజులో 92 కేక్‌లు ఆర్డర్‌ చేశాడు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌ సమయాల్లోనూ కేక్‌లు ఆర్డర్‌ చేయడం ఒక స్పెషల్. 

Watch this interesting Video:

#swiggy #biryani
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe