New Update
భార్యభర్తల మధ్య సవాలక్ష నమస్యలు వస్తాయి..పోతాయి. కాపురమన్నాక ప్రతి విషయాన్ని సాగీదీస్తే సంసారం సజావుగా ఉండదు. అయితే ఓ భర్త.. భార్యను హత్య చేయడానికి తెగించాడు. పిలిచిన వెంటనే కాపురానికి రాలేదని కక్షతో భార్యను కిరాతకంగా దాడి చేశారు. అడ్డం వచ్చిన వారినిసైతం వదలేదు.
భార్య కాపురానికి రావట్లేదని హత్యాయత్నం చేశాడు ఓ భర్త.. భార్య కృష్ణవేణిపై కక్షతో హత్య చేసేందుకు యత్నించిన కుమార్. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురంలో చోటుచేసుకుంది. కొత్తగూడెంకు చెందిన భూక్యా కుమార్కు జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురంకు చెందిన గుగులోత్ కృష్ణవేణికి పదేళ్ల క్రితమే వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటంతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పిల్లలతో కలిసి గత ఏడాదిగా పడమటి నర్సాపురంలోని పుట్టింట్లోనే కలిసి నివాసం ఉంటుంది కృష్ణవేణీ. శనివారం..సెప్టెబర్ 2న అత్తారింటికి వచ్చిన కుమార్ భార్య కృష్ణవేనిని తనతో ఇంటికి రమ్మని పిలిచాడు. కొద్ది రోజుల తర్వాత వస్తానని భార్య చెప్పిదో..ఏమో గాని. భార్యపై కక్ష పెంచుకున్నాడు కుమార్.. నిన్న రాత్రి అత్తింటికి వచ్చి మరి హత్యచేసేందుకు యత్నించాడు. భార్యను కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. అంతేకాకుండా కృష్ణవేణి మెడను కత్తితో కోశాడు. ఆమె కేకలు వేయటంతో సమీపంలో అత్తా, మరిదిపై వెంటతెచ్చుకున్న కత్తితో దాడి చేసి కుమార్ పరారయ్యాడు.
సంఘటనా స్ధలానికి చేరుకున్న స్థానికులు.. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితులను హుటాహుటిన కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాధితులను స్ధానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చెరిపించారు. అక్కడ ప్రాధమిక చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకుని పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితులను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Advertisment