మంచి చెప్పినా తప్పే..
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఒగ్గు నిర్మలపై ఆమె భర్త మల్లేష్ కొడవలితో హత్యయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం భార్య భర్తలు ఇరువురు గత కొంతకాలంగా గొడవ పడుతున్నట్లు హమాలీ పని చేసే మల్లేష్ యాదవ్ తప్ప తాగి వచ్చి ప్రతిరోజు భార్య నిర్మలను చితకబాదుతున్నట్లు పేర్కొన్నారు. అతని పిల్లలు స్కూల్‌కు వెళ్ళడంతో భార్య నిర్మల ఇంట్లో ఒంటరిగా ఉండగా పథకం ప్రకారము మల్లేశం వచ్చి రాగానే కొడవలితో మెడ వెనక భాగంలో పొడిచి అత్యాయత్నానికి ప్రయత్నించగా ఆమే కేకలు వేయడంతో ఇరుగు పొరుగువారు రావటంతో ఆయన పారిపోయినట్లు తెలిసింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహాయంతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ఆమెను తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను అంబులెన్స్‌లో సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.