Heavy Rains : అగ్రరాజ్యం అమెరికా (America) భారీ వర్షాలు (Heavy Rains), వరదలతో అల్లాడిపోతుంది. భారీ వర్షాలతో వందల ఇళ్లు నీటిలో మునిగి తేలుతున్నాయి. అయోవా , సౌత్ డకోటాలో సుమారు వారం రోజుల నుంచి కుండపోత వానలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో పలు కౌంటీలు నీట మునిగాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే సౌత్ డకోటాలో అధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, వరదలు (Floods) ఉంటాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే వేలాదిమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాఫ్టర్ల సాయంతో రెస్క్యూ టీమ్ (Rescue Team) రక్షించింది.
రాక్ వ్యాలీ ప్రాంతంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. నదులు రికార్డు స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. వరదల వల్ల రాక్ నది పొంగిపొర్లుతున్నాయి. ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికారులు సైరన్లు మోగించి అప్రమత్తం చేస్తున్నారు. వరద నీటిలో కార్లు కొట్టుకుపోతున్నాయి.
Also read: ఇక నుంచి రాత్రి 10.30 కల్లా షాపులు మూసివేయాల్సిందే!