Amazon : వందలాది ఉద్యోగులు తొలగింపు..ఇప్పటికే 27వేల మంది ఔట్...కారణాలివే..!!

అమెజాన్ అలెక్సా విభాగంపై వేటు పడింది. వందలాది మంది ఉద్యోగుల తొలగింపు ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే 27వేల మందిని తొలగించింది. వాణిజ్య ప్రధాన్యాలు మారుతున్న తరుణంలో జనరేటివ్ ఏఐపై ఫోకస్ పెట్టినట్లు అమెజాన్ ప్రతినిధి తెలిపారు.

Amazon Mega Electronics Days Sale: అమెజాన్లో మెగా ఎలక్ట్రానిక్ డేస్ సేల్.. ఈ వస్తువులపై ఊహించని డిస్కౌంట్లు!
New Update

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితుల కారణంగా ప్రముఖ కంపెనీలన్నీ ఖర్చులు తగ్గించుకునే దిశగా పయణిస్తున్నాయి. ఇందులో భాగంగా సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. దానికి తోడు పెరుగుతున్న టెక్నాలజీతో మరింత మంది ఉద్యోగులపై వేటు పడుతోంది. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తూ శుక్రవారం వెల్లడించింది. లేఆఫ్స్ కు సంబంధించి ఈ మెయిల్ ద్వారా ఉద్యోగులకు సమాచారం అందించినట్లు అమెజాన్ తెలిపింది.

వాణిజ్య ప్రాధాన్యాలు మారుతున్న తరుణంలో జనరేటవ్ ఏఐపై ఫోకస్ పెట్టినట్లు అమెజాన్ ప్రతినిథి ఒకరు తెలిపారు. దాంతో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో సిబ్బందిని తొలగిస్తున్నట్లు చెప్పారు. అయితే ఎంతమందిని తొలగిస్తున్నారనేది మాత్రం ఖచ్చితంగా చెప్పేందుకు నిరాకరించారు. లేఆఫ్స్ అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ రౌష్ స్పందించారు. ఉత్పాదకతను పెంచేందుకు ఏఐ సామార్థ్యాలను పెంపొందించడంపై ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. అలెక్సా వాయిస్ విభాగంలో కొత్త మార్పులు తీసుకువచ్చేందుకు ఖర్చు తగ్గింపుతో పాటు వ్యాపార ప్రాధాన్యాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

కంపెనీలు ప్రస్తుతం ఏఐ టూల్స్ పై ఆధారపడుతున్నాయి. ఏఐ ద్వారా తమ ఉత్పాదకత పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి. అమెజాన్ కూడా కొన్ని నెలలుగా ఏఐనే ఉపయోగిస్తోంది. దీనిలో భాగంగానే ఈ ఏడాది సెప్టెంబర్ లో అలెక్సాలో జనరేటివ్ ఏఐ ఆధారిత ఫీచర్లు ప్రవేశపెట్టింది. ఇప్పటికే అమెజాన్ సంస్థ గతేడాది చివరిలో ఈ ఏడాది మొదట్లో దాదాపు 27వేల మంది ఉద్యోగులను తొలగించింది.

మరోవైపు వర్క్ ఫ్రం ఆఫీస్ విధానాన్ని ప్రోత్సహించేలా అమెజాన్ యాజమాన్యం మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆఫీసుకు తిరిగి రాని ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వకూడదని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ నిర్ణయించింది. పని కోసం కార్యాలయానికి తిరిగి రాని ఉద్యోగులు పదోన్నతి కోసం వైస్ ప్రెసిడెంట్ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. వారానికి మూడు రోజులు కార్యాలయానికి రాని ఉద్యోగులను ఇప్పుడు తొలగించవచ్చని కంపెనీ నిర్వాహకులకు తెలిపింది. బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం, ప్రమోషన్ కోసం షెడ్యూల్ చేసిన ఉద్యోగులు కంపెనీ రిటర్న్-టు-ఆఫీస్ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని అమెజాన్ తన మేనేజర్‌లకు గత నెలలో తెలిపింది. దీని ప్రకారం వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేయాల్సి ఉంటుంది. అలా చేయని ఉద్యోగులు పదోన్నతి పొందాలంటే ముందుగా ఉపరాష్ట్రపతి ఆమోదం పొందాలని స్పష్టం చేసింది. 

ప్రమోషన్ కావాలంటే ఆఫీస్ కు రండి:

అంతేకాదు ఉద్యోగుల ప్రమోషన్ల బాధ్యతలను ఆయా విభాగాల మేనేజర్లకు అప్పగించింది. ఉద్యోగులతో చేయించే రోజువారీ ఆఫీస్ పనులతోపాటు ప్రమోషన్లకు తగిన అర్హతలను గుర్తించాలని చెప్పింది. ఆఫీసులో పనిచేసేందుకు మొగ్గు చూపే ఉద్యోగులు ప్రమోషన్లు, ఇతర అంశాలపై వైస్ ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకోవల్సిన అవసరం లేదని..ఆ బాధ్యతలను సైతం మేనేజర్లే చూస్తారని అమెజాన్ ఉద్యోగులకు ఓ ఇంటర్నల్ ఇ మెయిల్ పంపించింది.

ఈ ఏడాది కొత్త వర్క్ పాలసీ:

అమెజాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగులు వారానికి 3రోజులు ఆఫీస్ కు రావాలంటూ కొత్త వర్క్ పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పని విధానం మే నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ తన బ్లాక్ పోస్టులో వెల్లడించారు. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన 30వేల మంది ఉద్యోగులను గత మే నెలలో సియోటెల్ లో ఉన్న అమెజాన్ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సంస్థ తీసుకువచ్చిన కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ ప్లకార్డులతో ప్రదర్శనకు దిగారు.

ఆగస్టు నెలలో ఉద్యోగుల ఆందోళనపై సీఈవో ఆండీ జెస్సీ స్పందిస్తూ…గతంలో మీరు కొత్త వర్క్ నిబంధలను అంగీకరించలేదు. ఇప్పుడు ఒప్పుకున్నా…ఒప్పుకోకపోయినా వారానికి 3 రోజులు ఉద్యోగులు ఆఫీస్ కు తప్పని సరిగా రావాల్సిందేనని హెచ్చరించారు. తాజాగా సిబ్బంది ఆఫీస్ కు రావాలని లేదంటే వారి ప్రమోషన్లను నిలిపివేస్తామని మరోసారి మెయిల్స్ పంపడంతో అమెజాన్ లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇతర సంస్థలు ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నాయి.

ఇది కూడా చదవండి: వాళ్లకు భయం పట్టుకుంది…అన్ని సర్వేలు కాంగ్రెస్ వైపే..ఉత్తమ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..!!

#amazon #technology-news #amazon-india-team #amazon-alexa-job-cuts #amazon-india-layoffs #amazon-firing #amazon-alexa
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe