Uttareni plant: ఉత్తరేణితో వందల రోగాలు మాయం..సంజీవనిలాంటి మొక్క

మన చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్నో రకాల మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రతీ మొక్కలో ఒక్కో ఔషధ గుణం ఉంటుందని ఆయుర్వేద గ్రంధాల్లో ఉంది. అలాంటి మొక్కల్లో ఉత్తరేణి మొక్క ఒకటి. ఉత్తరేణి గింజలను పొడిగా చేసి ఉప్పు కలిపి దంతాలను శుభ్రం చేసుకోవచ్చు.

New Update
Uttareni plant: ఉత్తరేణితో వందల రోగాలు మాయం..సంజీవనిలాంటి మొక్క

Uttareni Plant Benefits: మన చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్నో రకాల మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏదో పిచ్చి మొక్కలని మనం వాటిని అసలు పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటాం. కానీ ప్రతి మొక్కలో ఒక్కో ఔషధ గుణం ఉంటుందని ఆయుర్వేద గ్రంధాల్లో ఉంది. అలాంటి మొక్కల్లో ఉత్తరేణి మొక్క ఒకటి. ఎన్నో ఔషధ గుణాలు ఈ మొక్క సొంతం. దీన్ని సంజీవని మొక్కగా కూడా అంటుంటారు. దీన్ని రసం చేదుగా ఉంటుంది. అయినా వాత, కఫ, పిత్త సంబంధిత సమస్యలను నయం చేయడానికి ఈ ఉత్తరేణి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఉత్తరేణిని అపమార్గ, మయూరక, కరమంజరి అని కొన్ని సంస్కృత పదాలతో పిలుస్తూ ఉంటారు. ఉత్తరేణి గింజలను పొడిగా చేసి 100 గ్రాముల చొప్పున తీసుకొని.. 10 గ్రాముల ఉప్పు కలిపి దంతాలను శుభ్రం చేసుకోవచ్చు.

ఉత్తరేణి ఆకుల పొడితో ఎన్నో లాభాలు

దీంతో పిప్పి పళ్ల సమస్య వెంటనే తగ్గిపోతుంది. ఉత్తరేణి ఆకుల పొడి నిప్పుల మీద వేసి ఆ పొగను పీలిస్తే దగ్గు, ఆయాసం వెంటనే తగ్గిపోతాయి. ఈ మొక్కను ఎండబెట్టి కాల్చి బూడిద చేసి రెండింతల చక్కెర కలిపి మూడు పూటలా మూడు గ్రాములు తీసుకుంటే గొంతు, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫమంతా వెళ్ళిపోతుంది. ఆయాసం, దగ్గు సమస్యలు తగ్గుతాయి. ఉత్తరేణి పచ్చి గింజలను నూరి వడకట్టి ఉదయాన్నే తాగడం వల్ల మూత్రాశయంలో రాళ్లు కరిగిపోతాయి. ఉత్తరేణి మొక్కవి ఏడు ఆకులు తీసుకుని ఏడు మిరియాలు కలిపి తినడం వల్ల గర్భిణులకు సుఖ ప్రసవం అవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: చిటికెలో దంతాలను తెల్లగా మార్చుకోండి..ఈ చిట్కాలతో!

ఈ ఆకులతో పాటు మిరియాలు, వెల్లుల్లిని నీటిలో కలిపి చిన్న చిన్న మాత్రలు చేసి ఎండబెట్టి నిలువ చేసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు ఓ రెండు చొప్పున తీసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. ఎర్ర ఉత్తరేణి ఆకుల రసాన్ని 50 గ్రాములు తీసుకొని మరో 50 గ్రాములు ఆవు నెయ్యి కలిపి తీసుకుంటే రక్త మొలలు తగ్గిపోతాయి. ఈ చెట్టు ఆకులు సహదేవి చెట్టు వేరు మిరియాలు అన్నీ కలిపి చిన్న మిరియాల గింజంత సైజులో తల్లిపాలతో కలిపి పిల్లలకు నాకిస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఈ చెట్టు వేరుతో పాటు నేలతాడి దుంప, పిప్పిళ్లు కలిపి అందులో బెల్లం వేసి పది గ్రాములు చొప్పున తింటూ ఉంటే బోదకాలు, బోదచేయి సమస్యలు ఉన్నవారు వాటి నుంచి బయటపడతారు. ఉత్తరేణి వేరు ముద్దను ఆవు మజ్జిగతో కలిపి తీసుకుంటే పాండురోగం తగ్గిపోతుంది. కడుపులో జీవక్రియ కూడా బాగుంటుంది. ఈ ఆకుల వేర్లు తీసుకొని పట్టిక బెల్లం కలిపి 10 గ్రాములు చొప్పున తింటే గర్భాశయ సమస్యలు తగ్గిపోతాయి. కాలేయం కూడా శుభ్రంగా మారుతుంది. అంతేకాకుండా రక్తం శుద్ధి అవుతుంది. చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు