Bangladesh-India Border: ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు బంగ్లాదేశ్ హిందువులు ప్రయత్నం..! బంగ్లాదేశ్ జల్పాయిగురి పరిధిలోని నాలుగు గ్రామాల ప్రజలు ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారిని బీఎస్‌ఎఫ్ దళాలు అడ్డుకుంటున్నాయి. అటు ఒడిశా తీరంలోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బోట్ల ద్వారా బంగ్లాదేశీయులు భారత్‌లోకి ప్రవేశించే ఛాన్స్ ఉంది. By Vijaya Nimma 08 Aug 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Bangladesh-India Border: బంగ్లాదేశ్‌లో హిందువులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి..! ఎప్పుడు ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తారో తెలియని దుస్థితి..! దీంతో వారంతా మరోసారి ఇండియా వైపే చూస్తున్నారు. ఆపద ఎప్పుడొచ్చినా బంగ్లాదేశీయులకు వెంటనే గుర్తొచ్చేది ఇండియానే. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా తర్వాత అక్కడ పరిస్థితులు మరింత గందరగోళానికి దారితీశాయి. ముఖ్యంగా అక్కడి రైట్‌వింగ్ గ్రూప్స్ కొన్ని మైనారిటీల లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. ఎక్కువగా హిందువులను టార్గెట్ చేసుకుంటున్నాయి. దీంతో బంగ్లాదేశ్ హిందువులు ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జల్పాయిగురి వద్ద టెన్షన్: బంగ్లాదేశ్‌లోని వందలాది మంది హిందువులు భారత సరిహద్దును దాటాలనే ఆశతో ఉన్నారు. ఈ మేరకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ముస్లింలు మెజారిటీగా ఉన్న బంగ్లాదేశ్‌లో కొంతమంది మత ఛాందస సంస్థలు హిందువులపై దాడులు చేస్తుండడమే దీనికి పెద్ద కారణం. బంగ్లాదేశ్‌లోని పంచగఢ్ జిల్లాలో చురకతి, బనియాపరా, బోనోగ్రామ్ లాంటి గ్రామాలలో వందలాది మంది హిందువులు బార్డర్ క్రాస్ చేసేందుకు ట్రై చేశారు. ఇక భారత్‌లోకి ప్రవేశించాలనే ప్రణాళికతో జీరో పాయింట్ దగ్గర గుమిగూడారు. జీరో పాయింట్ జల్పాయిగురి పట్టణం నుంచి 40కిమీ దూరంలో ఉంటుంది. ఆ భూభాగాలు ఇండియావే: జల్పాయిగురి పరిధిలో ఉన్న నాలుగు గ్రామాలు1947 ముందు వరకు భారత భూభాగంలోనే ఉన్నాయి. ఆ తర్వాత తూర్పు పాకిస్థాన్, పశ్చిమ పాకిస్థాన్‌గా ఒక దేశం ఏర్పడింది. ఇక1971లో తుర్పు పాకిస్థాన్-పశ్చిమ పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఇండియా తూర్పు పాకిస్థాన్ పక్షాన నిలపడి పాక్ సైనికులతో పోరాడింది. ఆ యుద్ధంలో విజయం సాధించడంతో తూర్పు పాకిస్థాన్ బంగ్లాదేశ్‌గా ఏర్పడింది. ఇక 2015లో భారత్-బంగ్లాదేశ్ మధ్య భూసరిహద్దు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం జల్పాయిగురి పరిధిలో ఉన్న నాలుగు గ్రామాలు ఇండియాకు చెందినవగానే గుర్తించారు. కంచె లేకపోవడంతోనే సమస్య: జల్పాయిగురి పరిధిలోని నాలుగు గ్రామాలను బంగ్లాదేశ్ మ్యాప్ నుంచి 2015లోనే తొలగించారు. ఆ తర్వాత రెండు దేశాలు తమ భూభాగాలను గుర్తించడానికి ఉమ్మడి భూ సర్వే నిర్వహించాయి. రెండు దేశాలను వేరు చేయడానికి సరిహద్దు స్తంభాలు నిర్మించారు. అయితే.. ఈ గ్రామాల సరిహద్దులో ఇంకా కంచెలు ఏర్పాటు చేయలేదు. అదే అసలు సమస్యకు కారణమైంది. ఆ గ్రామాల్లోని బంగ్లాదేశీయులు ఈ కంచె లేని సరిహద్దును దాటి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: నార్మల్ డెలివరీ అయ్యి లేబర్ పెయిన్ తగ్గాలంటే ఇలా చేయండి! #bangladesh-india-border మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి