Fahadh Faasil: పుష్ప నటుడు ఫహద్ ఫాసిల్ పై కేసు.. కారణం ఆ సినిమానే..! నటుడు ఫహద్ ఫాసిల్ పై కేరళ మానవ హక్కుల సంఘం కేసు నమోదు చేసింది. ఇందుకు కారణం ఆయన లేటెస్ట్ మూవీ 'పింకేలీ'లోని కొన్ని సీన్స్ ఎర్నాకులంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో షూట్ చేశారు. ఎమర్జెన్సీ వార్డులో చేయడంతో రోగులు ఇబ్బందికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో కేసు నమోదు చేసినట్లు సమాచారం. By Archana 29 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Fahadh Faasil: మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ చిక్కుల్లో పడ్డారు. కేరళ హ్యూమన్ రైట్స్ కమీషన్ ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేసింది. అయితే ఫహద్ ఫాసిల్ మలయాళంలో 'పింకేలీ' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలు కేరళలోని ఎర్నాకులంలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చిత్రీకరించారు. ఈ సన్నివేశాలు ఆసుపత్రిలోని ఎమెర్జెన్సీ వార్డులో షూట్ చేయడంతో అక్కడి రోగులు ఇబ్బందికి గురైనట్లు తెలుస్తోంది. దీని పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేరళ మానవ హక్కుల సంగం నటుడు ఫహద్ ఫాసిల్ కేసు నమోదు చేసింది. అలాగే ఎమెర్జెన్సీ వార్డులోకి ఎలా అనుమతించారని కమిషన్ సభ్యురాలు బీనా కుమారి వైద్య సిబ్బంది పై మండిపడ్డారు. వారం లోపు దీని పై వివరణ ఇవ్వాలని వైద్యులను ఆదేశించినట్లు సమాచారం. అయితే షూటింగ్ సమయంలో ప్రమాదకర పరిస్థితిలో ఉన్న వారిని కూడా లోపలికి అనుమతించలేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ ఈ ఆరోపణలను నిర్మాత సంఘం ఖండించినట్లు తెలుస్తోంది. ఫహద్ ఫాసిల్ మలయాళీ స్టార్ ఫహద్ ప్రస్తుతం సుకుమార్ పాన్ ఇండియా ఫిల్మ్ పుష్ప 2 లో విలన్ గా కీలక పాత్ర పోషిస్తున్నారు. పుష్ప’పార్ట్ 1 లో భన్వర్ షింగ్ షెకావత్ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన ఫహద్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఆగస్టు 15 న విడుదల కానున్న ఈ చిత్రం.. మళ్ళీ డిసెంబర్ 6 కు వాయిదా పడింది. Also Read: Bad Newz Trailer: త్రిప్తి దిమ్రి- విక్కీ కౌశల్ 'బ్యాడ్ న్యూస్'.. ట్రెండింగ్ లో ట్రైలర్..! - Rtvlive.com #fahadh-faasil మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి