Nobel Peace Prize 2023: ఇరాన్ కు చెందిన మానవ హక్కుల కార్యకర్త.. నార్గిస్‌ కు నోబెల్ శాంతి బహుమతి

ఇరాన్ లో మహిళల అణిచివేత, మానవ హక్కుల పై పోరాడి ఎన్నో సార్లు జైలుకెళ్లిన నార్గిస్‌ మొహమ్మదును నోబెల్ శాంతి(Nobel Peace Prize) పురస్కారం వరించింది.

New Update
Nobel Peace Prize 2023: ఇరాన్ కు చెందిన మానవ హక్కుల కార్యకర్త.. నార్గిస్‌ కు నోబెల్ శాంతి బహుమతి

Nobel Peace Prize : ఇరాన్ కు చెందిన మానవ హక్కుల(Human Rights) కార్యకర్త నార్గిస్‌ ను నోబెల్ శాంతి బహుమతి(Nobel Peace Prize) వరించింది. ఇరాన్ లో మహిళల పై జరుగుతున్న అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన నార్గిస్‌ కు నార్వే నోబెల్ కమిటీ ఈ అవార్డును అందజేస్తున్నట్లు ప్రకటించింది.

యూనివర్సిటీ విద్యను అభ్యసించే రోజుల్లోనే నార్గిస్‌ మహిళల హక్కుల గురించి పలు పత్రికల్లో రాసి తన గళం వినిపించేది. స్వేచ్ఛ, మానవ హక్కుల కోసం పోరాడుతున్న 'నార్గిస్‌' ప్రస్తుతం జైల్లో ఉన్నారు. చదువుకునే రోజుల్లోనే మహిళల హక్కుల కోసం పోరాడి రెండు సార్లు అరెస్ట్ అయ్యారు.

జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఆమె పోరాటాన్ని మాత్రం ఆపలేదు. సంప్రదాయాల పేరుతో ఎన్నో ఆంక్షలు విధించే ఇరాన్ లో ఈమె జన్మించింది. అయిన సరే దైర్యంగా ముందుకెళ్లి ఆమె పోరాటాన్ని కొనసాగించింది. విద్యను పూర్తి చేసుకున్న నార్గిస్‌ (Narges) ఎన్నో పత్రికల్లో పాత్రికేయురాలిగా పనిచేసింది. 'The reforms, the Strategy and the Tactics' అనే రాజకీయ వ్యాసాల పుస్తకాన్ని ప్రచురించింది. ఆ తర్వాత నార్గిస్‌, షిరిన్‌ ఇబాది స్థాపించిన డిఫెండర్స్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ (DHRC) సంస్థలో చేరి తన సేవలను అందించింది.

మహిళ హక్కుల కోసం పోరాటం(Protest) చేస్తున్న నార్గిస్‌ 13 సార్లు అరెస్ట్ అయ్యారు. ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించిన కారణంగా 1998 లో మొదటి సారి అరెస్ట్ అయ్యి సంవత్సరం పాటు జైల్లోనే ఉన్నారు.

జాతీయ భద్రతకు హాని కలిగించేలా ఆమె ప్రచారాలు ఉండటం వల్ల 2011లో 11 ఏళ్ళు జైలు శిక్షను విధించారు.కొంత కాలానికి బెయిల్ పై బయటకు వచ్చారు. ఎన్ని అవాంతరాలు, సవాళ్లు ఎదురైనా ఆమె పోరాటాన్ని ఆపలేదు.

ఇరాన్ లో మహిళల పై జరుగుతున్న లైంగిక వేధింపులు, అక్కడ ఇష్టానుసారంగా విధిస్తున్న మరణ శిక్షల పై పోరాటం సాగించారు.
2015 లో ఆమె మళ్ళీ అరెస్ట్ అయ్యింది. జైల్లో ఉన్నప్పటికీ ఇరాన్ లో చోటు చేసుకున్న హిజాబ్ ఘటన పై పత్రికల ద్వారా తన గొంతు వినిపించింది.
హిజాబ్ ఘటన పై ఆమె రాసిన నివేదిక ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'BBC' పత్రికలో వచ్చింది.

ఇరాన్ లో మహిళల అణిచివేత, మానవ హక్కులు, స్వేచ్ఛ పై పోరాడిన నార్గిస్‌ కు ఇప్పుడు నోబెల్ శాంతి పురస్కారం దక్కింది.

Also Read: Chandrayaan-3: జాబిల్లిపై చిమ్మ చీకటి.. శాశ్వత నిద్రలోకి చంద్రయాన్‌.. రోవర్‌, ల్యాండర్ ఏం చేస్తాయి?

Advertisment
తాజా కథనాలు