Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు గమనిక..జూన్‌ 30 వరకు దర్శనాలు రద్దు..!

వేసవి సెలవులు ముగుస్తుండడంతో పాటు అన్ని పరీక్షల ఫలితాలు వెలువడడంతో గత వారం రోజులుగా తిరుమల కొండ పై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జూన్ 30 వరకు శుక్ర, శని ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు గమనిక..జూన్‌ 30 వరకు దర్శనాలు రద్దు..!
New Update

TTD Cancels VIP Break Darshan: వేసవి సెలవులు ముగుస్తుండడంతో పాటు అన్ని పరీక్షల ఫలితాలు వెలువడడంతో గత వారం రోజులుగా తిరుమల కొండ పై భక్తులు దర్శనానికి బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జూన్ 30 వరకు శుక్ర, శని ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. ముఖ్యంగా వీకెండ్ మూడు రోజులు సామాన్య భక్తుల రద్దీ కారణంగా.. దర్శనానికి సుమారు 30-40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.

సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా.. జూన్‌ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాలలో బ్రేక్‌ దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని.. భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. భక్తులు కూడా రద్దీని గమనించి తిరుమల ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

శనివారం తెల్లవారుజాము నుంచే తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. కొండపై వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు అన్ని నిండిపోయి.. ఏకంగా రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూ కట్టి ఉన్నారు. భక్తులు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనానికి 20 గంటలకుపైగా సమయం పడుతోందని టీటీడీ చెబుతోంది. టీటీడీ రద్దీని గమనిస్తూ.. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తున్నారు.

Also read: బంగాళాఖాతంలో రెమాల్‌..వారికి వానలు..మనకి మండే ఎండలు!

#heavy-rush #tirupti #devotees #ttd #tirumala
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe