/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/ODISHA-ACCIDENT.jpg)
Road Accident :ఒడిశా (Odisha) బరిపడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. NH-18పై హైదరాబాద్ (Hyderabad) కు చెందిన టూరిస్ట్ బస్సు (Tourists Bus) ను ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు హైదరాబాదీలు మృతి చెందగా... మరో 20మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బస్సు బీహార్ (Bihar) లోని గయకు వెళ్తుండగా ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఉదయం 5.30గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్పారు. బస్సులో హైదరాబాద్‌కు చెందిన 23మంది పర్యాటకులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రమాద తీవ్రతకు బస్సు ముందుభాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే