Nagarjuna Sagar: నారగార్జున సాగర్ కు వరద పోటెత్తింది. వరద ప్రవాహంతో నిండుకుండలా నాగార్జునసాగర్ ప్రాజెక్టు మారింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. 2 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. వరద ఉధృతి ఇలానే కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 64 వేల 699 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 64 వేల 699 క్యూసెక్కులు వద్ద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులు వద్ద ఉంది.
తుంగభద్రకు వరద...
తుంగభద్ర జలాశయం వరద ప్రవాహం కొనసాగుతోంది.
* పూర్తి స్థాయి నీటి మట్టం:1633 అడుగులు
* ప్రస్తుతం నీటి మట్టం:1627.87 అడుగులు
* ఇన్ ఫ్లో 23,725 క్యూసెక్కులు
* ఔట్ ఫ్లో 10,023 క్యూ సెక్కులు
* పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలు
* ప్రస్తుతం నీటి నిల్వ 86,274టీఎంసీలు
Also Read : నిన్న నాగార్జున.. నేడు పల్లా.. హైడ్రా యాక్షన్‌పై ఉత్కంఠ