Breaking: హైదరాబాద్ లో గ్యాస్‌ పైప్‌ లైన్ లీక్‌..భారీగా ఎగిసిపడుతున్న మంటలు!

కొంపల్లి- సుచిత్ర ప్రధాన రోడ్డు పై గ్యాస్‌ పైప్‌ ఒక్కసారిగా లీకైంది. గ్యాస్‌ లీక్‌ కావడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.

New Update
Breaking: హైదరాబాద్ లో గ్యాస్‌ పైప్‌ లైన్ లీక్‌..భారీగా ఎగిసిపడుతున్న మంటలు!

హైదరాబాద్ లో గ్యాస్‌ పైప్‌ లైన్ లీక్‌ కలకలం రేపుతుంది. కొంపల్లి- సుచిత్ర ప్రధాన రోడ్డు పై గ్యాస్‌ పైప్‌ ఒక్కసారిగా లీకైంది. గ్యాస్‌ లీక్‌ కావడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. రోడ్డు పక్కనే మంటలు ఎగిసిపడుతుండండంతో స్థానికులు, వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు.

భాగ్య నగర గ్యాస్‌ సరఫరా పైపు లీక్ అయినట్లు తెలుస్తోంది. కొంపల్లి వద్ద రోడ్డు అభివృద్ధి పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అటువైపుగా వాహనాలు కానీ, ప్రజలు కానీ వెళ్లకుండా ఆంక్షలు విధించారు.

పోలీసులు వెంటనే భాగ్యనగర్‌ గ్యాస్ అధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మెయిన్ లైన్ గ్యాస్‌ను ఆపేసిన సిబ్బంది, పైప్ లైన్‌కు మరమ్మత్తులు చేస్తున్నారు.

ఈ గ్యాస్ లీకేజీ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

updated soon...

Also read: ఆ పాపం అధికారులదే.. నా మాట వినలేదు.. బస్ ప్రమాదంలో డ్రైవర్ సంచలన నిజాలు

Advertisment
తాజా కథనాలు