సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం గత కొద్దీ రోజులుగా హైదరాబాద్, సికింద్రాబాద్ వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే పలు సంఘటనలు చోటుచేసుకోగా.. తాజాగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. By Vijaya Nimma 09 Jul 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పాలికా బజార్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్‌కి దగ్గర్‌లోనే ఉన్న ధమాకా సేల్ అనే బట్టల షాపులో ముందుగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. తర్వాత అవి పక్కనున్న షాపుకి కూడా అంటుకున్నాయి. బట్టల షాపులు కావడం వల్ల మంటల కంటే ఎక్కువగా పొగ వస్తోంది.ఈ ఏరియాలో దాదాపు 400 షాపులు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా బట్టల షాపులే ఉన్నాయి. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నా... కుదరట్లేదు. పొగ చాలా ఎక్కువగా వస్తూ.. ఫైర్ సిబ్బందికి కూడా ఇబ్బంది కలుగుతోంది .దాదాపు 4 ఫైరింజన్లతో మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మిగతా షాపుల వారు.. తమ షాపుల్లోని బట్టలు, సామాన్లను బయటకు తీసుకొస్తున్నారు. ప్రమాదంపై ఆరా అయితే షాపుల్లో ఎవరూ లేరన్న పోలీసులు.. ప్రాథమిక సమాచారం ప్రకారం.. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు.జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కూడా అక్కడికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలోనూ ప్రమాదం మార్చిలో సికింద్రాబాద్ ప్యాట్నీ వద్ద గల స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని 7,8 అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ వ్యాపించడంతో పలువురు ఆఫీసుల్లోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొన్న విషయం మనకు తెలిసిందే. కాంప్లెక్స్‌లో పలు కార్యాలయాలతో పాటు వాణిజ్య సముదాయాలు ఉండడంతో పదుల సంఖ్యలో ఉద్యోగులు చిక్కుకున్నారు. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో క్యూనెట్ సంస్థలో పని చేసే ఆరుగురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి