Fire Accident in Karimnagar: కరీంనగర్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బతుకుదెరువుకోసం పొట్ట చేతపట్టుకుని వచ్చిన వలస కార్మికుల గుడిసెలు కాలి బూడిదైపోయాయి. అంతేకాదు మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో గ్యాస్ సిలిండర్లు (Gas Cylinders) పేలాయి. దీంతో ఆ మంటలు కాస్త చుట్టుపక్కలకు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
5 గ్యాస్ సిలిండర్లు పేలి..
ఈ మేరకు కరీంనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల రహదారిలోని సుభాష్‌నగర్‌లో (Subhashnagar) వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులు పూరిళ్లు వేసుకుని నివాసముంటున్నారు. అయితే ఇదే ప్రాంతంలో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 5 గ్యాస్ సిలిండర్లు పేలడంతో. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అదించగా మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: MLA RK: జగన్‌ను తిట్టమన్నారు… ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు!
ప్రాణనష్టం తప్పింది..
అయితే ఈ పూరిళ్లలో నివాసం ఉంటున్న కార్మిక కుటుంబాలన్నీ మేడారం జాతరకు వెళ్లినట్లు తెలిపారు. దీంతో భారీ ప్రాణనష్టం తప్పిందని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.