Tamilanadu : పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు..ఎగిరిపడ్డ మృతదేహాలు!

తమిళనాడు (Tamilanadu) లోని ఓ పటాకుల ఫ్యాక్టరీ(Factory) లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.

Tamilanadu : పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు..ఎగిరిపడ్డ మృతదేహాలు!
New Update

తమిళనాడు (Tamilanadu) లోని ఓ పటాకుల ఫ్యాక్టరీ(Factory) లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని హాస్పిటల్‌ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడులోని మైలాడుదురైలో ఉన్న ఓ బాణాసంచా గోడౌన్‌ లో కార్మికులు పనిలో నిమగ్నమై ఉండగా..ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పటాకుల గోడౌన్ కావడంతో కార్మికుల శరీరాలు వంద మీటర్ల దూరం ఎగిరిపడ్డాయి. మరికొందరు తీవ్రంగా గాయాలపాలయ్యారు.

Also read: మరో 14 రోజులు జైల్లోనే.. ప్చ్‌.. చంద్రబాబుకు నిరాశే..!

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన నలుగురు కార్మికులను కూడా మాణికం, మదన్‌, రాఘవన్‌, నికేష్‌ గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిని అగ్ని మాపక సిబ్బంది రక్షించారు. గోడౌన్ యజమానికి లైసెన్స్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

అయితే ప్రమాదం జరగడానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే మైలాడుతురై డీఆర్వో మణిమేకలై, ఆర్డీవో అర్చన, నాగపట్టణం ఎస్పీ హర్ష్‌ సింగ్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం తెలిపారు.

చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబానికి రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు ప్రకటన విడుదల చేశారు.

#explosion #tamilandu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe