/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Drugs-have-created-a-stir-in-Hyderabad-once-again-jpg.webp)
Drugs In Hyderabad: హైదరాబాద్ లోని పాతబస్తీ బహదూర్‌పూర్‌లో (Bahadurpur) డ్రగ్స్ పట్టుబడ్డాయి. బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్నారు సయ్యద్, ఊన్నీసా దంపతులు. నాలుగేళ్లుగా డ్రగ్స్‌ను అమ్ముతున్నట్లు గుర్తించారు. రేవ్ పార్టీలతో (Rave Party) పాటు పబ్బులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లతో పాటు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పొలిసు విచారణలో చెప్పారు. 3 నెలల్లో 19 మంది ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేశారు. ట్రాన్స్‌పోర్ట్ ద్వారా డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మకాలు చేస్తునట్టు పేర్కొన్నారు. గతంలోనూ పలుమార్లు సయ్యద్ దంపతులు అరెస్ట్ అయ్యారు. సయ్యద్ దంపతులతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసింది టీఎస్ న్యాబ్.
Also Read: కేసీఆర్‌పై ఈడీ కేసు.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు