Shirdi Sai : షిర్డీకి భారీగా విరాళాలు..పదిరోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..!!

షిర్డీలోని సాయిబాబా ఆలయానికి విరాళాలు వెల్లువెత్తాయి. భక్తులు ఇచ్చిన కానుకలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కేవలం పదిరోజుల్లోనే 17. 50కోట్ల రూపాయలు విరాళంగా వచ్చినట్లు ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.

New Update
Shirdi Sai  : షిర్డీకి భారీగా విరాళాలు..పదిరోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..!!

షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని ప్రతిరోజూ వేలాసంఖ్యలు భక్తులు దర్శించుకుంటారు. దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు బాబాను దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. బాబాకు కానుకల రూపంలో విరాళాలు సమర్పించుకుంటారు. ఆ విధంగా షిర్డీలోని సాయిబాబా ఆలయానికి భక్తులు విరాళంగా ఇచ్చిన కానుకలు రికార్డు స్థాయికి చేరాయి. కేవలం పది రోజుల్లోనే 17.50కోట్ల రూపాయలు విరాళంగా వచ్చినట్లు ఆలయ ట్రస్ట్ నిర్వహకులు తెలిపారు.

నవంబర్ 10 నుంచి నవంబర్ 20వ తారీఖు వరకు షిర్డీ సాయిబాబా ఆలయంలో భక్తులు రూ. 17.50కోట్లు సమర్పించారు. అందులో నగదుతోపాటు కిలోల కొద్దీ వెండి, బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి. బాబాఆలయాన్ని దర్శించుకున్న భక్తులు వేసిన కానుకలతో పాటు విరాళాల రూపంలో వచ్చిన నగదు మొత్తం పది రోజుల్లో 17.50కోట్ల 086రూపాయలు వచ్చినట్లు షిర్డీ సాయిబాబా సంస్థాన్ తెలిపింది.

బాబా ఆలయాన్ని దీపావళి పర్వదినాలతోపాటు సెలవుల రోజులు కలుపుకుని ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రావడం ఇదే రికార్డు అని షిర్డీ సంస్థాన్ తెలిపింది. రూ. 17.5కోట్ల రూపాయల్లో దక్షిణ బాక్సులో 7కోట్ల రూపాయలు వచ్చినట్లు వెల్లడించింది. అటు డొనేషన్ కౌంటర్ లో రూ. కోటి 98లక్షలు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక పీఆర్వో టారీఫ్ విరాళాలు 2కోట్ల 85వేలు, డెబిట్, క్రెడిట్ కార్డు ఆన్ లైన్ రూపంలో విరాళాలు అందించినట్లుగా ప్రకటించారు.

బాబా పేరుతో చెక్కులు, డీడీ, మనీ ఆర్డర్ల ద్వారా మరో 3కోట్లు, ఇక 22లక్షల విలువ చేసే 4వందల గ్రాముల బంగారం, నాలుగున్న లక్షల విలువ చేసే వెండిని భక్తులు విరాళాల రూపంలో చెల్లించుకున్నట్లు ఆలయ ట్రస్టు నిర్వాహకులు తెలిపారు.

ఇది కూడా చదవండి: రైతు బంధుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్

Advertisment
తాజా కథనాలు