Tirumala : తిరుమల వెళ్లాలనుకుంటున్నారా.. అయితే వాయిదా వేసుకోండి.. ఎందుకంటే!

తిరుమలలో భక్తుల రద్దీ గత నాలుగు రోజులుగా కొనసాగుతుంది. భక్తులతో కంపార్ట్‌ మెంట్లు అన్ని కూడా నిండిపోయాయి. ఉచిత సర్వ దర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

New Update
Tirumala: జులై 18న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

Huge Devotees Rush At Tirumala :  తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ గత నాలుగు రోజులుగా కొనసాగుతుంది. భక్తులతో కంపార్ట్‌ మెంట్లు అన్ని కూడా నిండిపోయాయి. ఉచిత సర్వ దర్శనానికి (Sarvadarshanam) 16 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. కాగా, 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 4 గంటల టైం పడుతోందని దేవస్థానం అధికారులు వివరించారు.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది. ఇక.. శనివారం 90 వేలకు పైగా మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో 33, 844 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా.. స్వామివారి హుండీ ఆదాయం 3 కోట్ల రూపాయలుగా లెక్క తేలింది.అయితే, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు.

ఇక, సర్వదర్శనానికి వెళ్లే భక్తులు దాదాపు 3 కిలో మీటర్లకు పైగా కాలినడకన క్యూలైన్లో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో టీటీడీ అధికారులు ఫ్రీ దర్శనానికి వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలను కల్పించకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also read: ఇరాన్ అధ్యక్షుడు మృతి!

Advertisment
తాజా కథనాలు