Pithapuram : పిఠాపురంపై అధికారుల స్పెషల్ ఫోకస్‌.. 17 గాజు గ్లాస్‌ పెట్టెలు సీజ్‌..!

పిఠాపురంపై ఎన్నికల అధికారులు స్పెషల్ ఫోకస్‌ పెట్టారు. ప్లయింగ్‌ స్క్వాడ్‌లతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జనసేన స్టిక్కర్‌ గుర్తు ఉన్న కారులో 17 గాజుగ్లాస్‌ పెట్టెలు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కారుతో పాటు గాజుగ్లాస్‌ల పెట్టెలు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు.

New Update
Pithapuram : పిఠాపురంపై అధికారుల స్పెషల్ ఫోకస్‌.. 17 గాజు గ్లాస్‌ పెట్టెలు సీజ్‌..!

Huge Cash :ఏపీ ఎన్నిక(AP Elections)ల నేపథ్యంలో పిఠాపురం(Pithapuram) ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్(Tollywood) స్టార్ హీరో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పిఠాపురంలో పోటీ చేయడంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే ఉంది. బుల్లితెర స్టార్లతో పాటు అటు మెగా ఫ్యామిలీ సైతం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారంతో దూసుకెళ్తున్నారు.

Also Read: ఏపీలో అధికారం ఎవరిదో చెప్పేసిన RTV.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?

ఇదిలా ఉంటే.. పిఠాపురంపై ఎన్నికల అధికారులు స్పెషల్ ఫోకస్‌ పెట్టారు. ప్లయింగ్‌ స్క్వాడ్‌లతో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. గాజుగ్లాస్‌ పెట్టెలు స్వాధీనం చేసుకున్నారు. కారుకు జనసేన స్టిక్కర్‌ గుర్తు ఉన్నట్లు గుర్తించారు. కారుతో పాటు గాజుగ్లాస్‌ల పెట్టెలను పోలీసులు సీజ్‌ చేశారు. అంతేకాకుండా గత రాత్రి 17 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నా అధికారులు కారును పిఠాపురం తహశీల్దార్‌ ఆఫీస్‌కు తరలించారు.

Advertisment
తాజా కథనాలు