TDP: టీడీపీ నేత ఇంట్లో భారీగా సొమ్ము స్వాధీనం.. అధికారి లెక్కలపై అనుమానాలు..!

ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో టీడీపీ నేత ఇంట్లో భారీగా సొమ్ము స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల అధికారులు. అయితే, అధికారి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధా లెక్కలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి రూ. కోటి దొరికిందని మరోసారి ఇంకా నగదు లెక్కపెట్టాలని ఆమె చెబుతున్నారు.

New Update
TDP: టీడీపీ నేత ఇంట్లో భారీగా సొమ్ము స్వాధీనం.. అధికారి లెక్కలపై అనుమానాలు..!

TDP: ఎన్టీఆర్ జిల్లాలో ఓటర్లను ప్రలోభ పెట్టందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మైలవరం నియోజకవర్గంలో టీడీపీ నేత ఇంట్లో భారీగా సొమ్ము స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల అధికారులు. గొల్లపూడిలో మైలవరం టీడీపీ నేత అనుచరుడు ఆలూరి సురేష్ ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ కోటి రూపాయలు స్వాధీనం చేసుకొంది.

Also Read: భార్య ఇంట్లో లేని సమయంలో హత్య.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రవికుమార్‌ మృతిపై అనుమానాలు..!

చట్టప్రకారం చర్యలు తీసుకొంటామన్నారు ఎన్నికల అధికారి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధా. అయితే, ఆమె లెక్కలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి కోటి రూపాయలు అని మరోసారి.. ఇంకా లెక్క పెట్టాలని ఆమె చెబుతున్నారు. దీంతో అధికారి మాటలపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు