ACB Rides : CCS ఏసీపీ ఉమామహేశ్వర రావు (Uma Maheshwar Rao) ఇంట్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. డబ్బుతో పాటు పెట్టుబడులు (Investments), ఇతర స్థలాల డాక్యుమెంట్లూ సీజ్ చేశారు. డబ్బు, పెట్టుబడులపై ఏసీబీ అధికారులు (ACB Officers) ఆరా తీస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో పని చేసినప్పుడు భారీగా వెనకేసినట్లు ఉమామహేశ్వర రావుపై ఆరోపణలు ఉన్నాయి. CCSకి మారిన తర్వాత ఉమామహేశ్వర రావు దందాలు రెట్టింపు చేసినట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పక్కా సమాచారంతో ఏసీబీ రైడ్స్ చేపట్టింది. ఉమా మహేశ్వర రావు డీల్ చేసిన కేసుల వివరాలను వెరిఫై చేస్తోంది ఏసీబీ. కాగా విచారణకు ఏసీపీ ఉమా మహేశ్వర రావు సహకరించడం లేదని ఏసీబీ అధికారులు తెలిపారు. సాహితి ఇన్‌ఫ్రా వ్యవహారంలో నిందితుల నుంచి భారీగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.
Also Read : మహిళ కడుపులో 570 రాళ్లు!