7 ఏళ్ల క్రితం చిన్నారి ఫోటో.. హ్యాపీ మూమెంట్‌ని షేర్ చేసిన ఆనంద్ మహింద్రా....

New Update

ఆనంద్‌ మహింద్రా తానెప్పుడు సోషల్‌మీడియాలో ఆక్టివ్‌గా ఉంటూ వింతలు విశేషాలను ఎప్పటికప్పుడు అందరితో పంచుకుంటాడు. అయితే ఇందులో చాలామంది ఆనంద్‌ మహింద్రాను కలిసేందుకు మాకు అవకాశం ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నాం అంటూ ఎదురుచూస్తుంటారు. అయితే ఓ చిన్నారి కోసం ఆనంద్‌ మహీంద్రా పెద్ద సాహసమే చేశాడనే చెప్పాలి. అయితే తనను వ్యక్తిగతంగా కలవడం సంతోషంగా ఉందన్నారు చిన్నారి రియా కుటుంబసభ్యులు. ఏడేళ్ల తర్వాత ఆనంద్‌ మహీంద్రాకు పరిచయమైన ఆ అమ్మాయి రియా.. అసలు ఈ కలయిక ఏంటి..? అసలు వీరిద్దరి స్టోరి తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

httpstwitter.comanandmahindrastatus1667818538260922369cxt=HHwWgoDUrfiHpKUuAAAA

ప్రపంచంలో జరుగుతున్న ఆసక్తికరమైన విషయాల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే వ్యాపారవేత్తలలో ఆనంద్ మహీంద్రా ఒకరు. అతని సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ కూడా ఉంది. మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆసక్తికరమైన వీడియోలు, పోస్ట్‌లు చేస్తూ తన 10 మిలియన్లకు పైగా ట్విట్టర్ ఫాలోవర్లను ఆశ్చర్యపరుస్తుంటారు. అలాగే ఒక్కోసారి తనకు పెట్టిన పోస్టుల్లో ఉన్న వారికి సాయం చేసేందుకు ఎప్పుడు ముందుంటారు. కొందరు ప్రతిభావంతులైన నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. అయితే, మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఒకసారి మహీంద్ర కారు స్టీరింగ్‌ పట్టుకుని ఉన్న ఒక చిన్నారి ఫోటోను షేర్‌ చేశారు. 7 ఏళ్ల క్రితం ఈ ఫోటోను షేర్‌ చేశారు.

ఇక ఇప్పుడు అదే చిన్నారి కాస్త పెద్దదై ఆనంద్ మహీంద్రాను కలవడమే కాకుండా అతనితో పరిచయం పెంచుకుంది. మీరు షేర్ చేసిన ఫోటోలోని అమ్మాయిని నేనే అని చెప్పింది. ఆనంద్ మహీంద్రా ఈ అందమైన క్షణం ఫోటోను ట్విట్టర్‌లో మళ్లీ షేర్‌ చేశారు.చిన్నారి రియా తనకు ఏడాది వయసున్నప్పుడు ఆమె ఫోటోను ట్వీట్ చేశానని నాకు గుర్తు చేసింది. ఆ ట్వీట్‌ను షేర్ చేసిన గౌరీష్‌కి ధన్యవాదాలు అనే శీర్షికతో ఆయన రాసుకొచ్చిన ట్వీట్ వైరల్ అవుతోంది. ట్విట్టర్‌లో గతంలో తను రియా కోసం పోస్ట్ చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్‌తో పాటు.. తాజాగా రియాతో తాను దిగిన ఫోటోను ఆనంద్ మహీంద్ర షేర్ చేసుకున్నారు. వీరి కలయిక అందమైన క్షణం అంటూ కొందరు నెటిజన్లు కామెంట్‌ చేయగా, మాకు మిమ్మల్ని కలిసే అవకాశం ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నాం అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. ఆనంద్‌ మహీంద్రాను వ్యక్తిగతంగా కలవడం సంతోషంగా ఉందన్నారు రియా కుటుంబ సభ్యులు.

ఈ పోస్ట్‌ను చూసిన పలువురు నెటిజన్లు కామెంట్స్‌తో ముంచెత్తారు. తదుపరి ఆమె ఖచ్చితంగా మహీంద్రా కారును కొనుగోలు చేస్తుందని ఒక ప్రేక్షకుడు వ్యాఖ్యానించాడు. మీ దయ, కరుణకు పెద్ద వందనమని మరొకరు తెలిపారు. మా ఉత్పత్తిని కొనుగోలు చేసేందుకు కస్టమర్ల కోసం ప్రజలు ఎప్పుడూ ఎదురుచూస్తారని.. కానీ మీ కస్టమర్లు మీ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు.

https://twitter.com/anandmahindra/status/1667818538260922369?cxt=HHwWgoDUrfiHpKUuAAAA

Advertisment
Advertisment
తాజా కథనాలు