అభిమాని చేసిన పనికి భావోద్వేగానికి గురైన హీరోయిన్ తమన్నా..!

ఓ వీరాభిమాని చేసిన పనికి మిల్కీ బ్యూటీ తమన్నా ముంబై ఎయిర్‌పోర్టులో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. అక్కడకు చేరుకున్న ఆ అభిమాని ఇంతకీ ఏం చేశాడు.. తమన్నా అసలెందుకు కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తెగ చెక్కర్లు కొడుతోంది.

అభిమాని చేసిన పనికి భావోద్వేగానికి గురైన హీరోయిన్ తమన్నా..!
New Update

heroine-tamannaah-got-emotional-after-seeing-her-tattoo-on-fans-hand-viral-video1

  • అభిమాని చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తమన్నా
  • ముంబై ఎయిర్‌‌పోర్టులో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన తమన్నా
  • ఆమె పాదాలను తాకి.. లేఖను ఇచ్చిన వీరాభిమాని
  • అతడి చేతిపై వేయించుకున్న పచ్చబొట్టును చూసి తమన్నా భావోద్వేగం

కొంతమంది ఫ్యాన్స్‌ చేసే అభిమానానికి హద్దులుండవు.. సినీ నటుల విషయంలో ఇది కాస్త ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. గుండెల్లో పెట్టుకునే వాళ్లు కొందరైతే.. గుడులు కట్టే వాళ్లు ఇంకొందరు.. గుండెలపై తమ అభిమాన హీరోహీరోయిన్ల పోటోలు, పేర్లు పచ్చ బొట్టు పొడిపించుకునేవాళ్లు ఇంకొందరు. తాజాగా ముంబై విమానాశ్రయంలో హీరోయిన్‌ మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించింది. దీంతో ఆమెను చూడటానికి చాలా మంది అభిమానులు ఎయిర్‌పోర్టు లోపలికి చేరుకున్నారు.

తమన్నా పాదాలను తాకి.. లేఖను ఇచ్చిన వీరాభిమాని

ఈ సందర్భంగా.. తన అభిమానులతో తమన్నా కాసేపు ముచ్చటించింది. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంది. అంతేకాదు ఎంతో సహనంతో అడిగిన వారికల్లా సెల్పీలకు ఫోజులు ఇస్తూ వారితో సందడి చేసింది. ఇక... ఇంతలోనే తన అభిమాని అక్కడకు చేరుకొని తమన్నా పాదాలను తాకి.. దండం పెట్టాడు. తర్వాత ఒక బొకే, లేఖను తన అభిమాన హీరోయిన్‌కు ఇచ్చాడు. ఈ సమయంలో తన చేతిపై వేయించుకున్న పచ్చ బొట్టును సైతం తమన్నాకు చూపించాడు. అది చూసిన తమన్నా ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది.

చేతిపై పచ్చ బొట్టును చూసి తమన్నా భావోద్వేగం

ఇంతకీ తమన్నా అభిమాని తన చేతిపై ఏం రాసుకున్నాడంటే..... తమన్నా ఫోటోతో పాటుగా ‘లవ్ యు తమన్నా’అని పచ్చ బొట్టు పొడిపించుకున్నాడు. అది చూసి ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్న తమన్నా.. ఆ అభిమానిని కౌగిలించుకుని ‘ధన్యవాదాలు’చెప్పింది.

https://twitter.com/Virajspeakss/status/1673583543933616128?cxt=HHwWgIDS4bfX4bkuAAAA

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe