Health Tips: వెన్నునొప్పికి చెక్ పెట్టే ఈ చిట్కాలు! స్క్రీన్ ముందు ఎక్కువ సేపు గడిపితే వెన్నునొప్పి వస్తుంది. నొప్పి తగ్గడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. పెయిన్ రిలీఫ్ క్రీమ్‌లు తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి. అయితే ఏదైనా మందులను ఉపయోగించే ముందు డాక్టర్‌ను సంప్రదించాలి. వీలైతే మీ స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి. ప్రతీ 30 నిమిషాలకు ఒక స్మాల్ గ్యాప్ తీసుకోండి. By Vijaya Nimma 23 Jun 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి How To get Rid of Back Pain: చాలా ముందు ఎక్కువగా టైమ్ గడిపేవారికి అనేక సమస్యలు వస్తుంటాయి. అవి మానసిక సమ్యసలే కాదు శరీరక సమస్యలు కూడా ఉంటాయి. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత బిజీ బిజీ బతుకుల్లో ఎక్కువ మంది కంప్యూటర్ల ముందు కూర్చొనే జాబ్సే చేస్తున్నారు. కంప్యూటర్లు లేకపోతే పని జరగని పరిస్థితి నెలకొంది. రోజుకు 8-10 గంటల పాటు కంప్యూటర్ల ముందు పని చేసే వారి సంఖ్య దేశవ్యాప్తంగా కోట్లలో ఉంటుంది. జాబ్ చేయకపోతే లైఫ్ ముందుకు వెళ్లదు.. కచ్చితంగా చేయాల్సిన పరిస్థితి. అయితే ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు గడపడం వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది వెన్ను. అందుకే వెన్నునొప్పి ఇప్పుడు అందరికి మోస్ట్ కామన్ సమస్యగా మారింది. ఇది కొన్నిసార్లు భరించలేని నొప్పిని కలిగిస్తుంది. అందుకే ఈ టిప్స్ పాటించండి.. కాస్త రిలీఫ్ రావొచ్చు. మీ కంప్యూటర్ స్క్రీన్ కంటి స్థాయిలో ఉండాలి. మీ కుర్చీ, డెస్క్ ఎత్తు ఏ లెవల్‌లో ఉండాలో తెలుసుకోండి. ➼ రెగ్యులర్ బ్రేక్‌లు: ప్రతీ 30 నిమిషాలకు చిన్న విరామం తీసుకోండి. ఇది మీ వీపుపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. చాలా మంది గంటలపాటు అలానే సిస్టమ్ ముందు ఉండిపోతారు. ఎప్పుడో కానీ పైకి లెగరు. ఇది చాలా డేంజర్. మీ వెన్నుపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది. అప్పుడు పెయిన్ కూడా పెరుగుతుంది. ➼ కూర్చున్నప్పుడు మంచి పోస్టర్(భంగిమ)ముఖ్యం. మీ పాదాలను నేలపై ఉంచి, మీ కుర్చీలో తిరిగి కూర్చోండి. కంప్యూటర్ కుర్చీనే ఉపయోగించండి. ➼ స్ట్రెచింగ్: మీ రొటీన్‌లో బ్యాక్, నెక్ స్ట్రెచ్‌లను చేర్చండి. సాధారణ వ్యాయామాలు చేయండి ➼ సపోర్టివ్ చైర్ కుషన్ ఉపయోగించండి ➼ మీ మెడపై ఒత్తిడిని తగ్గించడానికి మీ స్క్రీన్ ఎత్తును సెట్ చేయండి. ఒక్కసారి నిపుణుడితో మాట్లాడితే కంప్యూటర్ డెస్క్, ఛైర్ గురించి డీటైలెడ్ ఇన్ఫో ఇస్తాడు. ➼ మీ స్క్రీన్‌పై బ్రైట్‌నెస్‌ని తగ్గించడానికి సరైన వెలుతురు ఉండేలా చూసుకోండి. లేకపోతే మనకు తెలియకుంనే మన పోస్టర్(భంగిమ) మారిపోతుంది. ➼ డీహైడ్రేషన్ కండరాల తిమ్మిరికి, అసౌకర్యానికి దోహదపడుతుంది. కాబట్టి ఎక్కువగా వాటర్ తాగండి. ➼ వీలైతే మీ మొత్తం స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి ➼ స్క్రీన్ నుంచి క్రమం తప్పకుండా విరామం తీసుకోండి. ➼ ఐస్ లేదా హీట్ ప్యాక్‌లు నొప్పిని తగ్గించుకోవచ్చు ➼ పెయిన్ రిలీఫ్ క్రీమ్‌లు తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి. ➼ ఏదైనా మందులను ఉపయోగించే ముందు డాక్టర్‌ను సంప్రదించండి. ➼ మీ వెన్నునొప్పి కొనసాగితే, తగిన సలహాలు, వ్యాయామాల కోసం డాక్టర్ లేదా ఫిజికల్ థెరపిస్ట్‌ని సంప్రదించండి. Also Read: మీ పిల్లలు పదేపదే ఫోన్ చూస్తున్నారా? సైంటిస్టుల షాకింగ్ ప్రకటన..! #health-tips-telugu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి