Potato Fingers: పొటాటో ఫింగర్స్ ను ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! బంగాళదుంపలు, చాట్ మసాలా, మిరియాల పొడి, బ్రెడ్ ముక్కలు, కోడి గుడ్లు, బియ్యం పిండి, నిమ్మరసం, కొత్తి మీర, ఆయిల్, కారం, రుచికి సరిపడ ఉప్పుతో రుచికరమైన పొటాటో ఫింగర్స్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 22 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Potato Fingers: దుంప జాతికి చెందిన బంగాళదుంపలతో అనేక రకాల వంటలు చేస్తారు. ఈ దుంపకు ఒక్కో ప్రాంతంలో ఒక్కొక పేరు ఉంది. వీటిని ఆలుగడ్డ, బంగాళదుంప, బంగాల్ దుంప అని పేరుతో పిలుస్తారు. ఈ మొక్క సొలనేసి కుటుంబానికి చెందిన గుల్మము. అయితే.. బంగాళదుంపలతో అనేక రకాలైన వంటకాలు, స్నాక్స్, కర్రీస్, ఫ్రైలు లాంటివి చేస్తారు. బంగాళ దుంపతో ఏం చేసినా ఏ స్నాక్స్ చేసినా టేస్ట్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. రెస్టారెంట్స్‌కి వెళ్లినప్పుడు ఎక్కువగా వెజిటేరియన్స్ పొటాలో ఫింగర్స్ ఆర్డర్ చేస్తారు. ఈ స్నాక్స్‌ని అదే రుచితో ఇంట్లో చేసుకోవచ్చు. ఎంతో సులభంగా చేసుకునే ఈ పొటాటో ఫింగర్స్‌ని స్పెషల్ డేస్‌లో, వీకెండ్స్‌లో, గెస్టులు వచ్చినప్పుడు చేసిపెడితే.. ఎంతో ఇష్టంగా తింటారు.. మళ్లీ మళ్లీ చేయమంటారు. మరి ఈ పొటాటో ఫింగర్స్ ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటో..? ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు, చాట్ మసాలా, మిరియాల పొడి, బ్రెడ్ ముక్కలు, కోడి గుడ్లు, బియ్యం పిండి, నిమ్మ రసం, కొత్తి మీర, ఆయిల్, కారం, రుచికి సరిపడా ఉప్పు. తయారీ విధానం: ముందు బంగాళదుంపలను 5 నుంచి 10 నిమిషాలు నీటిలో వేసి అలానే ఉంచాలి. ఇలా ఉంచటం ద్వారా తొక్క త్వరగా వస్తుంది. తర్వాత పైన తొక్క తేసి.. పొడుగ్గా ఫింగర్స్‌లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆలూ ముక్కలను ఉప్పు వాటర్‌లో వేసి 20 నిమిషాలు ఉంచాలి. వీటిని శుభ్రం చేయాలి. ఇలా చేయడం వలన బంగాళ దుంపల్లో ఉండే పిండి పదార్థం బయటకు వెళ్తుంది. ఇప్పుడు క్లీన్ చేసిన ఆలూ ముక్కలపై చాట్ మసాలా, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మ రసం వేసి ఈ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. వీటిని 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో చిన్న గిన్నెలో గుడ్లు పగల కొట్టి గిలకొట్టాలి. మరో ప్లేట్‌లో బియ్యం పిండి, బ్రెడ్ ముక్కలను మిక్సీలో వేసి కాస్త బరకగా పట్టుకుని సిద్ధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి..డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి నూనె వేడైన తర్వాత ఆలూ ముక్కలను గుడ్ల మిశ్రమంలో ముంచి బియ్యం పిండిలో ఒక సారి రోల్ చేసి.. తర్వాత బ్రెడ్ పొడిలో అటు ఇటు తిపప్పి ఆ ముక్కలను వేడెక్కిన ఆయిల్ వేసి వేయించ్చుకోవాలి. ఇవి లేత గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే..ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఫింగర్స్ సిద్ధం అవుతాయి. వీటిని సాస్‌తో, మయనీస్‌తో తింటే చాలా టేస్ట్ సుపర్‌గా ఉంటుంది. ఇది పిల్లలకే కాదు పెద్దలకు కూడా బాగా నచ్చుతుంది. ఎంతో ఇష్టం తింటారు.ఝ ఇది కూడా చదవండి: శృంగార జీవితానికి.. పొగ తాగడానికి ఉన్న సంబంధం ఏంటి..? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #home #recipe #potato-fingers #easily మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి