Recipes: ఉదయం ఏం టిఫిన్ చేయాలని ఆలోచిస్తున్నారా? రుచికరమైన నీర్ దోశ ట్రై చేయండి..!!

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రేక్ ఫాస్టుల్లో దోశ ఒకటి. చాలామందిచి దోశ అంటే చాలా ఇష్టం. బయట బ్రేక్ ఫాస్ట్ చేయాల్సి వస్తే మెనూకార్డు తీసి మొదట ఆర్డర్ ఇచ్చేది దోశనే. దోశలో ఎన్నో రకాలు ఉంటాయి. వెన్న దోశ, బటర్ దోశ, చీజ్ దోశ, పనీర్ దోశ, ఎగ్ దోశ, మసాలదోశ, ప్లేన్ దోశ, ఇలా ఎన్నో వెరైటీలు ఉన్నాయి. ఒక్కోటి ఒక్కప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. అయితే ఇప్పుడు మనం నీర్ దోశ గురించి తెలుసుకుందాం. కర్నాటకలో ఎక్కువ మంది నీర్ దోశను ఇష్టంగా తింటుంటారు. ఆంధ్రాలో కూడా దీన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు.

Recipes: ఉదయం ఏం టిఫిన్ చేయాలని ఆలోచిస్తున్నారా? రుచికరమైన నీర్ దోశ ట్రై చేయండి..!!
New Update

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రేక్ ఫాస్టుల్లో దోశ ఒకటి. చాలామందిచి దోశ అంటే చాలా ఇష్టం. బయట బ్రేక్ ఫాస్ట్ చేయాల్సి వస్తే మెనూకార్డు తీసి మొదట ఆర్డర్ ఇచ్చేది దోశనే. దోశలో ఎన్నో రకాలు ఉంటాయి. వెన్న దోశ, బటర్ దోశ, చీజ్ దోశ, పనీర్ దోశ, ఎగ్ దోశ, మసాలదోశ, ప్లేన్ దోశ, ఇలా ఎన్నో వెరైటీలు ఉన్నాయి. ఒక్కోటి ఒక్కప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. అయితే ఇప్పుడు మనం నీర్ దోశ గురించి తెలుసుకుందాం. కర్నాటకలో ఎక్కువ మంది నీర్ దోశను ఇష్టంగా తింటుంటారు. ఆంధ్రాలో కూడా దీన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే ఈ దోశని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేస్తారో చూద్దాం.

ఇది కూడా చదవండి: గర్భిణీలు నవ్వితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?

నీర్ దోశకు మామూలు దోశల్లా పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేదు. ఈదోశను తయారు చేయడానికి ముందుగా 4 నుంచి 8 గంటల ముందు బియ్యాన్ని నానబెట్టాలి. తర్వాత ఆ బియ్యాన్ని రుబ్బుకుని దానికి ఉప్పు కలుపుకోవాలి. కానీ మామూలు దోశలకంటే దీనికి నీరు ఎక్కువగా పడుతుంది. పిండి పల్చగా ఉండాలి. ఇప్పుడు పిండిని పక్కన పెట్టుకోండి. పెనం వేడి చేసి దానిపై కొన్ని చుక్కల నూనె వేయండి.

ఉల్లిపాయ ముక్కతో పెనం మీద నూనె రాస్తే దోశ చక్కగా వస్తుంది. దోశ వేసే ముందు ఉల్లిపాయ ముక్కతో నూనె రాయండి. ఎందుకంటే నీరు పైకి తేలి ముద్ద కింద ఉంటుంది. కాబట్టి దోశ వేసిన ప్రతిసారి పైకి కిందికి కదపాలి. ఇప్పుడు ఒక గరిటె తీసుకుని పాన్ దోశ వేయండి. దానిపై మూత పెట్టండి. రెండు నిమిషాలు ఉడికించండి. దోశ పూర్తయినప్పుడు పెనం నుంచి అంచులు కొదిగా పైకి తేలుతుంటుంది. అప్పుడు దోశన మడవకుండా తీసి ప్లేట్లో పెట్టండి. తిరిగేసి మళ్లీ కాల్చకండి. వేడిగా ఉన్నప్పుడే కొబ్బరి చట్నీతో దోశను తింటుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా దీన్ని తింటారు.

ఇది కూడా చదవండి:  మంగళవారం ఇలా చేస్తే…దుర్గమాత అదృష్టాన్ని ప్రసాదిస్తుంది..!!

#recipes #neer-dosha #morning-break-fast
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe