Recipes: ఉదయం ఏం టిఫిన్ చేయాలని ఆలోచిస్తున్నారా? రుచికరమైన నీర్ దోశ ట్రై చేయండి..!!
దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రేక్ ఫాస్టుల్లో దోశ ఒకటి. చాలామందిచి దోశ అంటే చాలా ఇష్టం. బయట బ్రేక్ ఫాస్ట్ చేయాల్సి వస్తే మెనూకార్డు తీసి మొదట ఆర్డర్ ఇచ్చేది దోశనే. దోశలో ఎన్నో రకాలు ఉంటాయి. వెన్న దోశ, బటర్ దోశ, చీజ్ దోశ, పనీర్ దోశ, ఎగ్ దోశ, మసాలదోశ, ప్లేన్ దోశ, ఇలా ఎన్నో వెరైటీలు ఉన్నాయి. ఒక్కోటి ఒక్కప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. అయితే ఇప్పుడు మనం నీర్ దోశ గురించి తెలుసుకుందాం. కర్నాటకలో ఎక్కువ మంది నీర్ దోశను ఇష్టంగా తింటుంటారు. ఆంధ్రాలో కూడా దీన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు.