Hair Fall: జుట్టు రాలిపోతుందా..అయితే కరివేపాకు నూనెను రాసేద్దాం!

కరివేపాకుతో జుట్టును పెంచుకోవచ్చు అని మీకు తెలుసా....ఇంట్లో సహజ సిద్దంగా తయారు చేసుకునే కరివేపాకు హెయిర్‌ ఆయిల్‌ జుట్టు కుదుళ్లను బలంగా తయారు చేయడమే కాకుండా జుట్టు రాలే సమస్యను కూడా నివారిస్తుంది.

New Update
Hair Fall: జుట్టు రాలిపోతుందా..అయితే కరివేపాకు నూనెను రాసేద్దాం!

Curry Leaves Oil: ఒక్కసారి మనమంతా 25- 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే..మన నానమ్మలు, అమ్మమ్మలు, అమ్మలు చాలా పెద్ద జడలతో (Long Hair) కనిపించేవారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మహిళ పెద్ద జుట్టును కలిగి ఉండాలనే అనుకుంటుంది. కానీ నేడు మారుతున్న జీవన శైలితో పాటు, వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం వల్ల చిన్న జుట్టుకే పరిమితం కావాల్సి వస్తుంది.

మంచి మందపాటి, పొడమైన, మెరిసే జుట్టు కలిగి ఉండాలని ఏ మహిళ మాత్రం కోరుకోదు చెప్పండి. అందుకే జుట్టును జాగ్రత్తంగా చూసుకోవడానికి ముందు జుట్టుకు ఉపయోగించేవి అన్ని కూడా ఉత్తమమైనవి అయ్యి ఉండాలి. మనం నిత్యం ఇంట్లో ఉపయోగించే పదార్థాలతోనే అద్భుతాలు చేయవచ్చు.

దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. మనం నిత్యం కూరల్లో ఉపయోగించే కరివేపాకుతో జుట్టును పెంచుకోవచ్చు అని మీకు తెలుసా....ఇంట్లో సహజ సిద్దంగా తయారు చేసుకునే కరివేపాకు హెయిర్‌ ఆయిల్‌ జుట్టు కుదుళ్లను బలంగా తయారు చేయడమే కాకుండా జుట్టు రాలే సమస్యను కూడా నివారిస్తుంది. అంతేకాకుండా జుట్టు పెరుగుదలలో కూడా సహాయపడుతుంది.

కరివేపాకు నూనె ఎలా చేయాలంటే..

ఈ కరివేపాకు నూనెను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, బీటా కెరోటిన్‌, అమినో యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి వెంట్రుకల కుదుళ్లను గట్టిగా చేయడంతో పాటు జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తాయి. అంతేకాకుండా తల పైన ఉండే చుండ్రును కూడా తగ్గిస్తుంది.

మరి జుట్టుకు మేలు చేసే ఈ కరివేపాకు నూనెను ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా..కరివేపాకు నూనెను తయారు చేయడానికి తాజా కరివేపాకు, ఒక కప్పు కొబ్బరి నూనె కావాలి. ముందుగా బాండీలో కొబ్బరి నూనె వేడి చేసి కరివేపాకు వేయాలి. దానిని 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి.

తరువాత నూనె చల్లారిన తరువాత కరివేపాకు ఆకులను తీసేసి వడగట్టుకోవాలి. ఇప్పుడు మీ చేతిలో కరివేపాకు హెయిర్‌ ఆయిల్‌ రెడీగా ఉంది. దీనిని జుట్టు, తల పై చక్కగా అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు మసాజ్‌ చేసుకోవాలి. ఓ గంట తరువాత మంచి షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఎన్నిసార్లు ఉపయోగించాలి..

ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇది పూర్తిగా ఇంట్లో తయారు చేసుకోవడంతో పాటు ఎటువంటి కెమికల్స్‌ కలపలేదు కాబట్టి జుట్టుకు హాని కలిగిస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం మీ జుట్టు కూడా బాపు గారి అమ్మాయి జుట్టంతా బారుగా ఉండాలంటే దీనిని వెంటనే ట్రై చేసేయండి మరి.

Also read: నేడు న్యూ బజాజ్ చేతక్ ఈవీ లాంచ్…ఒకసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ ప్రయాణిస్తుుంది..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు