Coconut Lassi : కొబ్బరి లస్సీ ఎలా చేస్తారు.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

కొబ్బరి లస్సీని వేసవిలోనే కాదు ఎప్పుడైనా తాగొచ్చు.. . దీనిని తాగితే శరీరం త్వరగా చల్లపడుతుంది. ఇది ఎంతో రుచిగా కూడా ఉంటుంది. అందుకే పిల్లలు దీనిని ఇష్టంగా తాగుతారు. ఈ కొబ్బరి లస్సీని ఒక్కసారి తాగితే చాలు మ‌ళ్లీ మ‌ళ్లీ తాగాల‌నిపిస్తుంది.

Coconut Lassi : కొబ్బరి లస్సీ ఎలా చేస్తారు.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
New Update

Coconut Lassi benefits: ప్రకృతి సిద్ధంగా లభించే కొబ్బరి అంటే అందరికి తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొబ్బరి నీళ్లును చాలామంది తరచూ తీసుకుంటారు. కానీ కొబ్బరి లస్సీ అనేది తక్కువగా తీసుకుంటారు. కొబ్బరి నీళ్లుతోనేకాదు కొబ్బరి లస్సీతో అనేక ఆరోగ్య ప్రయోజనలు ఉన్నాయని తెలుసా.. కొకోన‌ట్ లస్సీ.. కొబ్బరి నీళ్లు, పెరుగు క‌లిపి చేసే ఈ లస్సీ ఎంతో రుచిగా ఉంటుంది. చాలామంది ల‌స్సీ.. అన‌గానే ఎక్కువగా వేసవి కాలంలో మాత్రమే తాగుతారని అనుకుంటారు. కానీ.. ఈ కొబ్బరి ల‌స్సీని ఎప్పుడైనా తాగ‌వ‌చ్చు. ఈ ల‌స్సీని తాగితే శ‌రీరంలో ఉండే వేడి త‌గ్గి శ‌రీరానికి చ‌లువని ఇస్తుంది. ఈ కొబ్బరి లస్సీని ఒక్కసారి తాగితే చాలు మ‌ళ్లీ మ‌ళ్లీ తాగాల‌నిపిస్తుంది. చాలా సులభంగా, చిటికెలో ఈ లస్సీని త‌యారు చేసుకోచ్చు. అంతే ఎంతో క‌మ్మగా, రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసే ఈ కొబ్బరి ల‌స్సీ వలన ఎలాంటి ఉపయోగాలన్నాయి..? దీనిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కొబ్బరి ల‌స్సీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:  ఐస్ క్యూబ్స్, లేత కొబ్బరి, పంచ‌దార, కొబ్బరి నీళ్లు, పెరుగు
ల‌స్సీ త‌యారీ విధానం:
మిక్స్‌లో ముందుగా ఐస్ క్యూబ్స్‌,కొబ్బరి బోండా నుంచి తీసిన లేత కొబ్బరి, కొబ్బరి నీళ్లు పోసి వీలైనంత మెత్తగా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత పెరుగు వేసి హైస్పీడ్ మీద మిక్సీ చేయాలి. కమ్మటి తీయటి చిక్కటి చల్లటి పెరుగునే మాత్రమే వాడుకోవాలి. పుల్లటి పెరుగు దీనికి పనికిరాదు. లస్సీ మీకు మంచి అరోమా కావాలి అనుకుంటే గనక మొదట్లోనే ఒకటి రోజ్‌ వాటర్‌ వేసుసుకోవాలి. త‌రువాత ఈ ల‌స్సీని గ్లాస్‌లో పోసి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి దానిని చ‌ల్ల చ‌ల్లగా స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి లస్సీ రడీ అవుతుంది. దీనిని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేస్తే ఈ ల‌స్సీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తాగుతారు. ఈ లస్సీకి లేత మీగడ లాంటి కొబ్బరిని తీసుకోవాలి. ఈ కొబ్బరి మీగడ ఉండాలి. దీనికి మామూలు పచ్చి కొబ్బరి లస్సీలు పనికిరాదు. దీనివల్ల కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. తాగేటప్పుడు భలే రుచిగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఒత్తిడి ఎక్కువైతే శరీరంలో జరిగే మార్పులు ఇవే..దీర్ఘకాలిక సమస్యలు తప్పవా..?

#health-benefits #coconut-lassi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe