Child Care: పిల్లల్లో మొండితనం పోగొట్టడం ఎలా..? తల్లిదండ్రులకు పిల్లలకు చిన్నతనంలోనే మంచి అలవాట్లు, మంచి మర్యాదలు నేర్పడం మంచిది. పిల్లలు మొండిగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు తిట్టడం మామూలే. తల్లిదండ్రులు తిడితే పిల్లలు సైలెంట్ అవుతారు కానీ వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు ఉండదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 31 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Child Care:నేటి బిజీ లైఫ్‌లో పిల్లలకు మంచి అలవాట్లు నేర్పడం తల్లిదండ్రులకు సవాలుతో కూడుకున్న పని. చిన్నతనంలో మంచి మర్యాదలు, అలవాట్లు నేర్పడం సులభం. కానీ పిల్లవాడు పెద్దయ్యాక అతని ఆలోచనలు, ప్రవర్తన మారుతాయి. పిల్లలు మొండిగా చేయడం వల్ల నలుగురిలో ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలు మొండిగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు తిట్టడం మామూలే. కానీ ఇలా చేస్తే పిల్లల మనసులు గాయపడతాయి. తల్లిదండ్రులు తిడితే పిల్లలు సైలెంట్ అవుతారు కానీ వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు ఉండదు. పిల్లవాడిని తిట్టడం కంటే ఈ అలవాటును సరిదిద్దడం మంచిది. పిల్లల ప్రవర్తన అతని చుట్టూ ఉన్న వాతావరణం వల్ల మారుతూ ఉంటుంది. అంతేకాకుండా పిల్లలు ఇతరులను చూసి నేర్చుకుంటారు. పిల్లవాడు తప్పుగా ప్రవర్తిస్తే అతనితో అరుస్తూ కాకుండా ప్రేమగా మాట్లాడండి. పిల్లల కోపం తగ్గిన తర్వాత నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. పిల్లవాడు ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం చేసుకోండి. కొట్టడం వల్ల పిల్లలకు కోపం మరింత పెరుగుతుంది. కొన్నిసార్లు అనుచితంగా కూడా ప్రవర్తించవచ్చు. పిల్లవాడు మీతో వాదించినట్లయితే ఆ సమయంలో ప్రశాంతంగా ఉండండి. పిల్లలతో వాదించడం మానుకోండి, అతని మాట వినండి. అప్పుడు పిల్లవాడు కూడా మీ మాట జాగ్రత్తగా వింటాడు. పిల్లల్లో కోపానికి కారణాలు ఇవే: పిల్లలు తల్లిదండ్రులు ఒప్పుకునే వరకు అనేక సాకులు చెప్పే విషయంలో, ఆహారం పెట్టే సమయంలో కోపం తెచ్చుకుంటారు. పిల్లలు మాట వినక తల్లిదండ్రులు అతని మొండితనానికి అలానే వదిలేస్తారు. అదే సమయంలో స్కూలుకు వెళ్లకపోవడం, కొత్త బొమ్మలు కొనడం, స్నేహితులతో ఆడుకోవడానికి బయటకు వెళ్లడం వంటి డిమాండులు పిల్లలు చేస్తారు. అంతేకాదు కోపం వచ్చినప్పుడు కొందరు పిల్లలు ఇంట్లో వస్తువులను పగలగొడతారు. ఇలాంటి వారిని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. పిల్లలో కోపం అదుపు: పిల్లల కోపాన్ని అదుపులో ఉంచుకోవాలంటే కోపానికి గల కారణాన్ని అర్థం చేసువాలి. దానికి అనుగుణంగా తల్లిదండ్రులు, ఇంట్లో వారు ప్రవర్తించాలి. పిల్లలు కోపంలో ఉంటే ప్రేమతో అర్థం చేసుకోవాలి. ఎలాంటి కారణం లేకుండా కోపంగా ఉన్న పిల్లలను ఒంటరిగా వదిలేయాలి.పిల్లవాడిని ఎక్కువగా కొడితే.. వారిలో మరింత చికాకు కలిగిస్తుంది. స్నేహితులతో విడిపోయినా, ఇల్లు మారినా పిల్లలతో ప్రేమగా మాట్లాడాలి. వారు కొత్త వారితో స్నేహం చేయడంలో సహాయం చేస్తే వాళ్ల కోపం తగ్గుతుంది. ఇది కూడా చదవండి: కుక్కర్‌లో వండిన పప్పు ఆరోగ్యానికి ప్రమాదమా? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #child-care #child-care-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి