Heart Health: గుండెపోటు ప్రమాదాన్ని ముందే పసిగట్టవచ్చా?

వైద్యుడి సూచనల మేరకు చికిత్స చేయించుకోవడం వల్ల ముందు జాగ్రత్తగా గుండెపోటు రాకుండా అలెర్ట్ అవొచ్చు. అయితే గుండెపోటు ప్రమాదాన్ని ముందే ఎలా తెలుసుకోవాలి? దీని గురించి పూర్తి డీటెయిల్స్‌ కోసం ఆర్టికల్‌ మొత్తాన్ని చదవండి.

Heart Health: గుండెపోటు ప్రమాదాన్ని ముందే పసిగట్టవచ్చా?
New Update

Heart Attack: వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతకాలంలో ప్రతి ఒక్కరికి గుండెపోటు వస్తోంది. చిన్నారులు సైతం గుండెపోటుతో చనిపోతూ ఉండటం చూస్తున్నాం. అయితే గుండెపోటు వచ్చే అవకాశాలను ముందుగానే కొన్ని టెస్టుల ద్వారా మనం కనిపెట్టవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. వీటి కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గుండెపోటు రాకుండా జాగ్రత్తగా..

మన పిడికిలిని గట్టిగా బిగించాలి, ఒక 40 సెకండ్లపాటు ఇలా ఉంచితే అరచేయి మొత్తం తెల్లగా మారుతుంది. ఆ తర్వాత వెంటనే రక్తం సరఫరా కావడంతో చెయ్యి ఎరుపురంగులోకి మారుతుంది. మామూలుగా అయితే ఎవరికైనా వెంటనే ఎరుపురంగులోకి మారుతుంది. కానీ గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి రక్తం సరఫరా సరిగా ఉండదు. అందుకే చెయ్యి మళ్లీ ఎరుపురంగులోకి మారేందుకు కాస్త సమయం పడుతుంది. ఇలా జరిగితే వెంటనే అప్రమత్తమై డాక్టర్‌ను సంప్రదించి గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుడి సూచనల మేరకు చికిత్స చేయించుకోవడం వల్ల ముందు జాగ్రత్తగా గుండెపోటు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించవచ్చు.

ఇది కూడా చదవండి: జలుబు,దగ్గుకు చెక్..ఈ కషాయం ఎప్పుడైన ట్రై చేశారా..?

మరో టెస్ట్‌ ఏంటంటే రెండు చేతి వెళ్లను గట్టిగా అదిమినట్టు పట్టుకోవాలి. ఐదు సెకండ్ల తర్వాత వదిలేయండి. ఆ తర్వాత తెల్లగా ఉన్న వేళ్లు ఎరుపుగా ఎంత సేపటికి మారుతున్నాయో గమనించండి. ఆలస్యంగా రంగు మారితే గుండె సమస్య ఉన్నట్టే అని గుర్తించండి. అంతేకాకుండా శ్వాస, జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నా కూడా ఇలా జరుగుతుంది. ఇలా జరిగితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. మరో టెస్ట్‌.. నేల మీద బోర్లా పడుకోవాలి. చేతులను నీల మీదే పైకి తెరచి ఉంచాలి. ఆ తర్వాత కాళ్లను పైకి లేపాలి. అలా ఒక 30 సెకండ్ల పాటు ఉండాలి. అంతసేపు ఉండగలిగితే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే.. లేకపోతే గుండె, జీర్ణాశయం, వెన్నెముకలో సమస్యలు ఉన్నట్టు లెక్క. ఇలా జరిగితే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #heart-attack
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe