ప్రతి ఒక్కరూ తమ ఇల్లు శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరికీ ధూళి లేదా మరే ఇతర రకాల సమస్యలు ఉండానలి కోరుకోరు. చాలా మంది ప్రజలు తమ ఇంటిని స్వయంగా శుభ్రం చేసుకుంటారు కొందరు వ్యక్తులు పని చేసే వారిని నియమించుకుంటారు. ఇల్లు క్లీన్‌గా ఉండడం కోసం ఎన్ని ప్లాన్లు చేసినా కొన్నిసార్లు ఎలుకలు వచ్చి ఇంటిని పాడుచేస్తుంటాయి. చాలాసార్లు ఎలుక ఇంట్లోకి ప్రవేశిస్తుంటుది. దీని కారణంగా ఇంటి సభ్యులు చాలా ఆందోళన చెందుతుంటారు. ఎలుకలు తిండి గురించి పక్కనపెడితే అవి వస్తువులను నాశనం చేస్తుంటాయి. అయితే ఎలుక బారి నుంచి బయటపడడం కోసం కొంతమంది వాటిని చంపేస్తుంటారు. ఇది అసలు కరెక్ట్ కాదు. ఎలుకలు కూడా జీవులే. వాటికి బతికే హక్కు ఉంది. ఈ విషయాన్ని మనుషులు గమనించాల్సి ఉంటుంది. అలాగని ఎలుకలను ఇంట్లోకి రానించి ఇల్లు పాడుచేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలుకను తరిమి కొట్టినా మళ్లీ వస్తుందని కొంతమంది చెబుతుంటారు. అలా తిరిగి రాకుండా ఎలుకను ఎలా తరిమికొట్టే పద్ధతులు ఏమిటో తెలుసుకోండి.
--> ఎలుకలను తరిమికొట్టడానికి మీరు పటిక సహాయం తీసుకోవచ్చు. ముందుగా పటికను గ్రైండ్ చేసి దాని పొడిని తయారు చేసుకోవాలి. అప్పుడు మీరు ఈ పొడిని ద్రావణాన్ని తయారు చేసి, ఎలుకలు ఎక్కడ కనిపించినా లేదా ఇంటి మూలల్లో స్ప్రే సహాయంతో ఈ ద్రావణాన్ని చల్లుకోవాలి.
--> మీ ఇంట్లో ఎలుకలు ఉంటే, వాటిని వదిలించుకోవడానికి పుదీనా మీకు సహాయపడుతుంది. నిజానికి, ఎలుకలకు పుదీనా వాసన అస్సలు ఇష్టం ఉండదు. ఇంట్లో పుదీనా ఉంచాలి లేదా ఎలుకలు కనిపించిన చోట ఉంచాలి.
--> మీరు ఎలుకలను పట్టుకోవడానికి పంజరం వేస్తుంటే ఈ ట్రిక్ తెలుసుకోండి. ముందుగా రోటీ ముక్కపై పెరుగును రాసి, ఆపై రోటీని నెట్‌లో ఉంచండి. దీని వల్ల ఎలుకలు ఆకర్షితులై బోనులో చిక్కుకుంటాయి.
--> కర్పూరం ఎలుకలను నివారించడంలో కూడా చాలా ప్రభావవంతంగా పని చేస్తుదంది. ఎలుకలు కర్పూరం వాసనను ఇష్టపడవు. కాబట్టి అవి ఆ వాసన రావడంతోనే పారిపోతాయి. మీరు ఇంటి మూలల్లో కర్పూరం ముక్కలను ఉంచితే ఎలుకలు ఇక మీ దరిదాపుల్లోకి రావు.
Also Read: పిల్లల్లో ఆకలిని పెంచే చిట్కాలు..ఇలా చేశారంటే వద్దన్నా తింటారు