కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేయాలి. ఉపవాసం ఎలా ఉండాలి. పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. కార్తీకమాసంలో సోమవారాలు ఎంతో ముఖ్యమైనవని అందరికీ తెలిసిందే. శివకేశవుల అనుగ్రహం కలిగేలా సోమవారాలను గడపడానికి కార్తీక పురాణం పఠించడం చాలా ముఖ్యమైంది. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శివుడికి దీరాధన చేయాలి. ఆవునేతితో దీపారధన చేయాలి. అష్టోత్తర శతనామవళి శివ అష్టోత్తర శతనామావళి శ్లోకాలు పఠించాలి. అర్థనారీశ్వరులను పూజించి నైవేద్యం సమర్పించి ఉపవాసం పట్టాలి. సాయంత్రం మళ్లీ శివపూజ చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి నక్షత్ర దర్శనం తర్వాత ఉపవాసం విరమించాలి.
పూర్తిగా చదవండి..Karthika masam : కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా చేయాలి..పాటించాల్సిన నియమాలు..!!
కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉంటే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం వంటి వాటిని తీసుకోకూడదు. నక్షత్ర దర్శనం చేసేటప్పుడు కార్తీక దామోదర రక్షించు కాపాడు అంటూ మనసులోని కోరికను చెప్పుకుని నమస్కరించాలి. రాత్రంతా జాగరణ చేసిన మర్నాడు అన్నదానం చేసి ఉపవాసం ముగించాలి.
Translate this News: