Karthika masam : కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా చేయాలి..పాటించాల్సిన నియమాలు..!! కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉంటే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం వంటి వాటిని తీసుకోకూడదు. నక్షత్ర దర్శనం చేసేటప్పుడు కార్తీక దామోదర రక్షించు కాపాడు అంటూ మనసులోని కోరికను చెప్పుకుని నమస్కరించాలి. రాత్రంతా జాగరణ చేసిన మర్నాడు అన్నదానం చేసి ఉపవాసం ముగించాలి. By Bhoomi 27 Nov 2023 in లైఫ్ స్టైల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేయాలి. ఉపవాసం ఎలా ఉండాలి. పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. కార్తీకమాసంలో సోమవారాలు ఎంతో ముఖ్యమైనవని అందరికీ తెలిసిందే. శివకేశవుల అనుగ్రహం కలిగేలా సోమవారాలను గడపడానికి కార్తీక పురాణం పఠించడం చాలా ముఖ్యమైంది. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శివుడికి దీరాధన చేయాలి. ఆవునేతితో దీపారధన చేయాలి. అష్టోత్తర శతనామవళి శివ అష్టోత్తర శతనామావళి శ్లోకాలు పఠించాలి. అర్థనారీశ్వరులను పూజించి నైవేద్యం సమర్పించి ఉపవాసం పట్టాలి. సాయంత్రం మళ్లీ శివపూజ చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి నక్షత్ర దర్శనం తర్వాత ఉపవాసం విరమించాలి. ఉపవాసం ఎలా చేయాలి: కార్తీక సోమవారం నాడు ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం వంటిని తీసుకోకూడదు. నక్షత్ర దర్శనం చేసేటప్పుడు కార్తీక దామోదర రక్షించు కాపాడు అంటూ మనసులోని కోరికలు చెప్పుకుని నమస్కరించుకోవాలి. కార్తీకసోమవారం ఉపవాసం ఉన్నవారు ఉదయమంతా తులసి తీర్థంతీసుకుంటూ శివనామస్మరణలతో కాలం గడపాలి. రాత్రంతా జాగరణ చేసి మర్నాడు అన్నదానం చేసి ఉపవాసం విరమించాలి. జీర్ణవ్యవస్థకు వారానికి ఒకరోజు సెలవు: వారం వారం మనం ఎలాగైతే సెలవు తీసుకుంటామో ఆ విధంగానే మన జీర్ణ వ్యవస్థకు కూడా వారానికి ఒకరోజు సెలవు ఇవ్వాలని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటే మన జీర్ణవ్యవస్థ తిరిగి శక్తిని పుంజుకునేందుకు అవకాశాన్ని ఇచ్చినట్లే. పైగా నిత్యం తీసుకునే ఆహారం జీర్ణించుకునేందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. తిన్నవెంటనే మత్తగా అనిపించడానికి కారణం కూడా ఇదే. అలా కాకుండా ఒక రోజంతా శరీరాన్ని వదిలేస్తే రక్షణ వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి ఆ సమయాన్ని వినియోగించుకుంటుంది. ఇది కూడా చదవండి: బైక్ కొనే ప్లాన్లో ఉన్నారా బ్రో…టాప్ -5 బైక్స్ ఇవే…!! #karthika-masam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి